(Translated by https://www.hiragana.jp/)
అవీ..ఇవీ...అన్నీ...: Health
The Wayback Machine - https://web.archive.org/web/20160221012248/http://aviiviannee.blogspot.in/search/label/Health
Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Thursday, August 9, 2012

‘ఐస్ టీ’తో కిడ్నీలో రాళ్లు!



‘ఐస్ టీ’ని అతిగా సేవిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం ఖాయమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. లయోలా విశ్వవిద్యాలయం వైద్య కేంద్రం యూరాలజిస్టులు తాజాగా జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణమైన ‘ఆక్సలేట్’ ఐస్ టీలో ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు తేల్చారు. ఐస్ టీ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి మూత్ర సంబంధ వ్యాధులతో పలువురు బాధపడుతున్నట్లు గుర్తించారు. కాగా, ఆరోగ్యకరమైన ద్రవపదార్ధాలను తీసుకోనందునే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని లయోలా వర్సిటీ వైద్య కేంద్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ మిల్నర్ హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో చెమట ద్వారా శరీరంలోని అధిక శాతం నీరు బయటకు పోతుందని, ఈ సమయంలో ఉపశమనం పొందేందుకు చాలామంది ఐస్ టీ సేవిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకే వేసవిలో పరిశుభ్రమైన నీటితోపాటు ఇతర ద్రవాలను విరివిగా తీసుకోవాలి. కేలరీలు తక్కువగా ఉంటూ, మంచి రుచి కలిగిన ఐస్ టీని తాగేందుకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. వేడి టీలో కూడా హానికరమైన ఆక్సలేట్ ఉన్నప్పటికీ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి తక్కువ ప్రభావం చూపుతుంది. మహిళలకంటే పురుషుల్లోనే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం ఎక్కువని, 40 ఏళ్లు పైబడ్డ వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు తేల్చారు. ఈ సమస్యను అధిగమించాలంటే తరచూ పరిశుభ్రమైన నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. సిట్రస్ అధికంగా ఉండే నిమ్మకాయలను వాడడంవల్ల కిడ్నీలో రాళ్ల ఎదుగుదలను నివారించవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఆక్సలేట్లు అధికంగా ఉన్న పాలకూర, చాక్లెట్లు, గింజలు వంటివి వినియోగించరాదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఉప్పు, కాల్షియం కలిగిన ఆహార పదార్ధాలను, మాంసం ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యకు దూరం కావచ్చు. ముఖ్యంగా మంచినీటిని ఎక్కువగా తాగాలని నిపుణులు పదే పదే సలహా ఇస్తున్నారు.

Source : Andhrabhoomi

Thursday, March 1, 2012

నవ్వు నాలుగు విధాల మేలు

నవ్వు నాలుగు విధాల చేటు- అని ఓ సామెత వుంది. నిజమే కాని అది కారణం లేకుండా నవ్వేవారికే వర్తిస్తుంది. అసలు మనిషి నవ్వకపోతే ఆరోగ్యానికే హాని కలుగుతుందంటున్నారు వైద్యులు. మనిషి తన బాధలను మరిచిపోగలిగేది ఒక నవ్వుతో మాత్రమే అనేది నిజం. కష్టాలనేవి అందరికీ వుంటాయి. ఎవరైతే తమ కష్టాలను మరిచిపోయి హాయిగా మనసారా నవ్వుకోగలుగుతారో వారిని మించిన ఆరోగ్యవంతులు ఎవరుంటారు చెప్పండి. నవ్వు అనేది ఏ మనిషికైనా వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి వుంటుంది. కొంతమంది ఎప్పుడు తాము నవ్వుతూ అందరినీ నవ్విస్తూ వుంటారు. మరికొందరు నవ్వటమే పాపం అన్నట్టు విచారంగా వుంటారు. వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైతే హాయగా నవ్వగలుగుతారో వారి దరికి ఎలాంటి అనారోగ్యాలు చేరవు. పౌల్ ఎక్మాన్ అనే మానసిక శాస్తవ్రేత్త 1960లో నవ్వుమీద పరిశోధన చేసి, ప్రతి మనిషి ముఖంలో సుమారు 43 కండరాలు నవ్వటానికి సహాయపడతాయని చెప్పారు. నవ్వుగురించి ప్రత్యేకంగా పేషియల్ ఏక్షన్ కోడింగ్ సిస్టమ్స్ అనే పద్ధతిని కనిపెట్టి అందుకు సంబంధించి మన శరీరంలో 18 రకాలైన గ్రంధులు ఉంటాయని తేల్చారు.
మనిషి శరీరంలోని రక్తప్రసరణను క్రమబద్ధీకరించే శక్తి ఒక నవ్వుకు మాత్రమే వుంది. ప్రాణవాయువు, న్యూట్రిషన్స్ శరీరానికి ఎంత అవసరమో, నవ్వు కూడా అంతే అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. బిగ్గరగా నవ్వడంవలన ఉదరం, కాళ్లు, చేతులు, ముఖ కండరాలు అన్నింటికీ వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. శరీరానికి ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావాలంటే నవ్వు తప్పనిసరి. నవ్వు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు మానసిక బలాన్నికూడా అందిస్తుందనడంలో సందేహం లేదు. మనిషిలోని స్వచ్ఛమైన నవ్వుకి, ముఖంలోని హావభావాలకి దగ్గరి సంబంధం వున్నట్లే శరీరంలో జరిగే పలు రసాయనిక మార్పులకి కూడా సంబంధం వుంది. శరరంలో ఎంజైములు, హార్మోనులు విడుదల కావడానికి ఆరోగ్యవంతమైన నవ్వు దోహదపడుతుంది. ఎంజైములు, హార్మోన్లు శరీర అవయవాల పనితనాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును క్రమబద్దీకరించుకోవడానికి మందులతో పనిలేకుండా ప్రతి రోజు కాసేపన్నా మనసారా నవ్వుతుంటే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశోధకులు సూచించారు. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా వుంటారు. హార్మోన్లలో అసమానతల కారణంగా, ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. నవ్వు శరీరంలోని హార్మోను ఉత్పత్తుల హెచ్చుతగ్గులను క్రమబద్ధీకరిస్తుంది. మనసారా నవ్వడంవలన ఒత్తిడి, ఆందోళన మాయమవుతాయి.
వయసు తగ్గించుకోండి..
వయసు పెరిగేకొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించేందుకు నిత్యం చిరునవ్వుతో ఆనందంగా వుంటే వయసు అంతగా తెలియదంటున్నారు ఆరోగ్య నిపుణులు. భావాలను వ్యక్తీకరించడంతోపాటు, నిత్యం చిరునవ్వును చిందిస్తుంటే అందంగా కనపడుతుంటారని పరిశోధకులు అంటున్నారు. నవ్వు ముఖానికి మంచి వ్యాయామం లాంటిది. నవ్వు ముఖంలోని కండరాలు ముడతలు పడకుండా వుండేందుకు దోహదపడుతుంది. ముఖం మరింతగా అందంగా కనపడాలంటే నిత్యం చిరునవ్వును చిందిస్తుండాలి. వీలు చిక్కినప్పుడల్లా కాస్త బిగ్గరగా నవ్వుతుంటే, ముఖానికి మంచి వ్యాయామం కలుగుతుందంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజు నవ్వును ఓ వ్యాయామంలా చేస్తుండాలి.
ప్రతిరోజు నవ్వడంవలన మనసుకు ఏకాగ్రత కలుగుతుంది. దీంతో మీకు తెలియకుండా మీలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అలాగే మీ వ్యక్తిత్వంలో మార్పు వచ్చి నిత్య యవ్వనులుగా కనపడతారు. ప్రతిరోజు నవ్వటం నేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు మనిషి నిత్య యవ్వనంగా వుంటారంటున్నారు పరిశోధకులు. నవ్వుతో శరీరంలోని ఎలాంటి జబ్బునైనా మటుమాయం చేయవచ్చంటున్నారు. నవ్వే శక్తి కేవలం మానవునికి మాత్రమే సాధ్యపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి ఎప్పుడూ నవ్వుతూ వుంటే కనుక వారి ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించి ఉండగలుగుతారు. నవ్వు ఎంత ప్రధానమైనదంటే మన మెదడులోని నరాలు శరీరంలోని కండరాలను నవ్వు ద్వారానే నియంత్రిస్తాయి. అందుకనే మనిషి హాయిగా నవ్వగలిగితే కండరాలన్నీ గట్టిపడి దృఢమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది.
-సుబ్బలక్ష్మి ( From Andhrabhoomi )

Tuesday, January 10, 2012

ఉసిరి ఉపయోగాలెన్నో?

అన్ని కాలాల్లోనూ ఉసిరికాయలు లభించవు. ఉగాది
వెళ్లిపోయిన తర్వాతనే వేసవి వచ్చే ముందు ఉసిరికాయలు
విరివిగా లభిస్తాయి. ఆయుర్వేద వైద్యంలో ఉసిరిని
అమృతతుల్యమైనదిగా భావిస్తారు. దీనిని విశిష్టమైన జీవ
రసాయనాల గుణ సమ్మేళనంగా చెప్పుకోవచ్చు.
ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా పేరొందిన చరకుడు ఉసిరి
రసాయన సేవనంతో వంద సంవత్సరాలపాటు ఎలాంటి బాధా
లేకుండా జీవించవచ్చని పేర్కొన్నాడు.
వ్యాధి నిరోధకశక్తిని ఎక్కువగా పెంచే సహజ ఫలం ఉసిరి. దీనిలో
విటమిన్-సి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఆకలి లేకపోవడం,
కడుపులో మంట, మలబద్ధకం, కడుపునొప్పి, పైల్స్, నోట్లోంచి
రక్తం రావడం, స్ర్తిలలో అధిక రక్తస్రావం, పంటి చిగుళ్ళనుండి రక్తం
రావడం, రక్తహీనత, దగ్గు, ఆస్త్మా, ఎముకలు బలహీనపడటం,
చూపు తగ్గడం, నరాల బలహీనత, మానసిక బలహీనతల వంటి
లోపాలను ఉసిరితో నివారించవచ్చు.
సబత్తాయికన్నా ఎక్కువ రెట్లు విటమిన్ సి ఉసిరిలో అధికం.
మన శరీరంలో ఉన్న ఎముకలు, లివర్, పళ్ళు, గుండె వీటికి
ఉసిరి మంచిది. మనం తినే ఆహారం జీర్ణమై బాగా
వంటబట్టడానికి ఉసిరి చాలా అవసరం. ఇప్పటికీ పాత
అలవాట్లున్నవారు భోజనంలో మొదటి ముద్దగా ఉసిరి పచ్చడి
కలుపుకొని భుజిస్తుంటారు.
సకప్పు ఉసిరికాయ రసంలో పది చుక్కలు తేనెకలిపి ఉదయం,
సాయంత్రం పిల్లలకు ఇస్తే వారిలో ఆకలి పెరుగుతుంది,
మలబద్ధకం వదిలిపోతుంది. కంటిచూపు మందగించినవారు
కంటిచూపుచక్కగా ఉండటానికి ఉసిరి వాడటం చాలా మంచిది.
సఉసిరి అద్భుతమైన కేశ సౌందర్య సాధనం. జుట్టు
యుక్తవయసులోనే తెల్లబడటం నివారిస్తుంది. అంతేకాకుండా
జుట్టు కుదుళ్లను గట్టిపరిచి జుట్టు వత్తుగా పెరగటానికి
దోహదపడుతుంది. ఉసిరి ముక్కలు వేసి కాచి వడపోసిన
కొబ్బరినూనె శిరోజాల సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది.
సషుగర్ నియంత్రణలో కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఏదో
ఒక రూపంలో ఉసిరిని కలిపి తీసుకోవడంవలన మానసికమైన
ఒత్తిడులు తగ్గిపోయి నిద్రలేమి ఉన్నవారు చక్కగా
నిద్రపోగలుగుతారు. ఎన్నో ఉపయోగాలున్న ఉసిరి వాడటాన్ని
తప్పనిసరి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

( Courtesy: Andhrabhoomi )

Monday, January 9, 2012

పిల్లల ఆరోగ్యం ముఖ్యం



ఒంట్లో నలతగా ఉందంటే అడుగు ముందుకెయ్యటానికి ఆలోచిస్తారు. ఆ పూటకి చెయ్యాల్సిన పనులను వాయిదా వేస్తారు. పెద్దల తీరే ఇలావుంటే ఇక పిల్లల విషయం? హోమ్‌వర్క్ చెయ్యలేదంటే స్టిక్ దెబ్బలు తప్పవంటుంది స్కూల్ టీచర్. పోనీ వర్క్ చేద్దామంటే కడుపునొప్పో, తల నొప్పో అసహనాన్ని తెప్పిస్తుంటుంది. బలవంతాన కళ్లు, కలం కదిలినా ఎక్కడో ఒక చోట పొరపాటు,్ల తప్పిదాలు. పిల్లల్ని ఇటువంటి సంకట స్థితినుంచి బయటపడేయాలంటే పెద్దలే చొరవ తీసుకోవాలి. అనారోగ్య హేతువులైన ఫుడ్ విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా చెరుపు చేసే పదార్థాలే ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి కనుక మంచి, చెడుల వ్యత్యాసం గుర్తించేలా ఇంటి దగ్గరే పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. స్నాక్స్ ఇష్టపడే పిల్లలకి వాటితోపాటు ఆరోగ్యకరమైన ఐటెమ్ మరొకటి జత అయ్యేలాచూడాలి. క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్స్ విషయంలో అనర్థాలు తెలియజెప్పి మితం పాటించమని చెప్పాలి. మార్కెట్ కెళ్లినపుడు పిల్లలు కావాలన్నవి వెంటనే కొనేయకుండా ఆరోగ్యకరమైన పదార్థాలవైపువారి దృష్టి మళ్లేలా చెయ్యాలి.
‘ఏ ఫర్ యాపిల్, ‘బి’ ఫర్ బనానా.. అంటూ తాజాపండ్లు తినిపిస్తూ పాఠాల్ని గుర్తు చేస్తే పిల్లల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. అన్ని రకాల ఆహారాన్ని రుచి చూపుతూనే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందేలా వారిని ముందుకు నడిపించాలి. పిల్లల బరువుని, వయసుని బట్టి ఎన్ని కేలరీలు అవసరమో ఎప్పటికప్పుడు నిపుణులను సంప్రదించి అనారోగ్యాలకి చోటులేకుండా చూడాలి. పోషక విలువలు కలిగిన పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విటమిన్స్, మినరల్స్ సరైన మోతాదులో అందితే ఆరోగ్యం చక్కబడి కొత్తవిషయాలు తెలుసుకోవడంలో, పాఠాలు ఔపోసన పట్టడంలో పిల్లలు శ్రద్ధ వహిస్తారు. జీడిపప్పు, బాదం, ఖర్జూరం, వాల్‌నట్స్ వంటివి అలవాటుచేస్తే ఇష్టంగా తింటారు. అధిక కేలరీలు వుండే చిప్స్ వంటివాటి జోలికి అంతగా వెళ్లరు.

Wednesday, December 28, 2011

బ్లాగు.. బ్లాగు

ఇంటర్నెట్టూ, ఇ-మెయిలూ ఎంత ప్రజాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెబ్ చాటింగూ, మెసేజింగూ పాతబడిపోయాయి. ఐతే మనలోని భావాలను ఎప్పటికప్పుడు వ్యక్తీకరించడానికి, ఏరోజు కారోజు డైరీ రాస్తుంటాం. అదే పదిమందికీ ఆ భావాలు తెలియాలీ, వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి అనుకున్నపుడు ఇంటర్నెట్‌లో అవన్నీ వెలిబుచ్చేందుకు వీలుగా ఏర్పడిన సౌకర్యమే ‘బ్లాగ్’. బ్లాగ్ (ఱజ్జది) అనేది వెబ్‌లాగ్ (జీఉఱ జ్జది) అనే పదం నుంచి పుట్టింది. స్థూలంగా ఇదొక వెబ్ పేజీ. సులభంగా నిర్వహించుకోవచ్చు. నేటి యువతలో ఎక్కువ భాగం తాము విన్నదీ కన్నదీ- ఉన్నదీ లేనిదీ- అన్నీ కలబోసి పెట్టిన బ్లాగ్‌లు కొల్లలుగా కనిపిస్తున్నాయి.
బ్లాగ్‌లో ఉంచే ప్రతి అంశాన్నీ‘టపా’ లేదా పోస్టు అంటారు. ఇవి సంవత్సరాల వారీ నెలలవారీ తేదీ వారీ- మనం ఉంచే క్రమంలోనే అమర్చి ఉంటాయి. చివరగా రాసింది (లేటెస్టుదన్నమాట) ముందు కనిపించేలా అమర్చి ఉంటాయి.
వ్యక్తిగత సమాచారాలనించీ రాజకీయ సిన్మా సమాచారాల దాకా, పెద్ద పెద్ద సంస్థలనుంచీ అడపాదడపా రాసే వారిదాకా, కలం తిరిగిన రచయితలనించీ కన్నుతెరిచి అపుడే మాటాడే వారిదాకా- ఇలా ఎందరివో ఎన్నో బ్లాగ్‌లు మనకు దర్శనమిస్తాయి. ఈ బ్లాగ్‌లలో చదివేవారి అభిప్రాయాలకీ విలువ ఎక్కువ. వారి సముదాయంతో ఒక రీడర్ గ్రూప్ ఏర్పడుతుంది. అపుడపుడూ చదివే పాఠకులూ ఉంటారు. అది వేరే సంగతి.
బ్లాగ్స్, వాటి వెబ్ సైట్స్- అన్నీ కలిపి ‘బ్లాగోస్పియర్’ అవుతుంది. అంటే బ్లాగ్ వాతావరణం అన్నమాట. ఇదొక భ్రాంతి చర్చా వేదిక. టీవీ, రేడియోలకన్నావేగంగా చేరుతుంది.
బ్లాగ్‌లవల్ల ఉపయోగాలు పలు రకాలు. కొందరు యదార్థవాదులుగా ఆన్‌లైన్ డైరీని నిర్వహిస్తూ ఉంటే, మరికొందరు సొంత ప్రచారానికే పెద్దపీట వేస్తూంటారు. ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడినించైనా వీటిని నిర్వహించుకోవచ్చు. ఈ బ్లాగ్‌లో కేవలం అనుభవాలూ, జ్ఞాపకాలూ మాత్రమే కాదు ఛాయా చిత్రాలూ, వీడియోలు కూడా ఉంచుకోవచ్చు. వీటినే ‘్ఫటోబ్లాగ్స్’ అంటారు. అదే రీతిలో ఆడియో క్లిప్‌లను ‘ఆడియోబ్లాగ్’ రూపొందించి ఉంచుకోవచ్చు. ఈమధ్య యూత్‌లో బాగా పాపులరయ్యింది ‘మోబ్లాగింగ్’. అంటే మొబైల్ ఫోన్‌ల ద్వారా బ్లాగ్‌లను నిర్వహించడం అన్నమాట.
అన్నట్టు, ఈ బ్లాగుల్లో బుల్లెట్స్‌తో అమర్చిన పాయింట్ బై పాయింట్ ఐటెమ్స్‌తో కూడిన హైపర్ లింక్‌లూ, పాఠకుల వ్యాఖ్యలూ, రేటింగ్స్‌తో కూడిన వ్యాసాలదాకా ఎన్నో ఉంటాయి. ప్రతి బ్లాగుకీ లింక్‌లు చాలా ముఖ్యం. అందువల్ల పాత టపా (ముందే చెప్పినట్టు) ఒక క్రమ పద్ధతిలో అమర్చి వాటికి ఒక స్థిరమైన లింక్ కేటాయించే ఏర్పాటూ ఉంది. దీనే్న ‘పెర్మాలింక్’ అంటారు. ఇదేమాదిరి తాజా వ్యాసాలూ, వార్తలూ, విశేషాలూ-వాటి లింక్స్‌ని చేరవేసేందుకు గడడ, ఆ్యౄ, తిజ అనే పద్ధతుల్లో అందించే సౌకర్యాలూ ఉన్నాయి. వీటిని ఎలాంటి ‘్ఫడ్’ రీడర్స్‌తోనైనా చదివేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలీ అంటే, వ్యక్తిగత అనుభవాలు, ఆలోచనలూ, ఫ్రెండ్‌షిప్, విషయాత్మకం, వార్తలు, సమూహాలు, రాజకీయ, న్యాయ, వ్యవసాయ, సినిమా, కళ, మత, సలహా, వ్యాపార సంస్థలు, ఆడియో, వీడియో, ఫొటో, డైరెక్టరీ- ఇలా పలు రకాలుగా ‘బ్లాగ్’లు దర్శనమిస్తున్నాయి. బ్లాగ్స్ అనేవి ఎలక్ట్రానిక్ సమాజాన్ని ఏర్పాటుచేశాయి.
నిజానికి ఇంటర్నెట్ రాకముందే ఎలక్ట్రానిక్ సంభాషణలూ, వైర్ యుద్ధాలూ జరిగేవి. హమ్ రేడియో ఎలక్ట్రానిక్ సమాజానికి చక్కని ఉదాహరణ. హమ్ రేడియో యూజర్లు పరిమిత సంఖ్యలో ఉండేవారు. దానికో రిజిస్ట్రేషనూ, పద్ధతీ అవీ ఉన్నాయి. హమ్ యూజర్లు గ్లాగ్ (సైబోర్గ్ లాగ్) అని వ్యక్తిగత డైరీలు రాసుకొనేవారు. ఇంటర్నెట్ వచ్చాక ఇమెయిల్ లిస్టింగ్, యూస్‌నెట్, బులెటిన్ బోర్డులు అందుబాటులోకి వచ్చాయి. 1990ప్రాంతంలో జీళఇన లాటి సాఫ్ట్‌వేర్‌లు నిరంతరం కొనసాగే సంభాషణలను రికార్డు చేసుకొనే వీలునిచ్చాయి. కొందరు జర్నల్స్‌ను రూపొందించారు. 1994లో జస్టిస్ హాల్ అనే అతడు ‘బ్లాగ్’ వాడటం మొదలెట్టినా, 1997లోనే జాన్ బార్జర్ ‘వెబ్‌లాగ్’ అనే మాటను తొలిసారిగా ప్రయోగించాడు. 1999లో ‘జీళఇ య’ అనే ఫదాన్ని ‘జీళ ఇ్య’ అంటూ ఫీటర్ మెర్వోల్జ్ తన బ్లాగులో ఉంచాడు. దీంతో ‘వెబ్‌లాగ్’ అన్నపదం మరుగున పడి ‘బ్లాగ్’ అనే పదం స్థిరపడిపోయింది. 2003 నాటికి నిఘంటువుల్లో చోటుచేసుకొంది కూడా.

- డా. సాయ అయతిక ( From Andhrabhoomi )

Tuesday, December 27, 2011

‘టీ’తో ఆరోగ్యం


కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడులేకున్నా ఒంటరిగానే రోజుకు ఐదారు లేదా అంతకుమించి ఎక్కువ కప్పుల టీ తాగేవారున్నారు. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు రెండు మూడు సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. టీవల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలున్నాయని వారంటున్నారు.
హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరంజ్ టీ, యాపిల్, హనీ టీ, ఐస్డ్ టీ, అల్లం టీ ఇలా అనేక రకాల టీలను తయారుచేసుకోవచ్చు. టీలో పాలు, చక్కెరకు బదులుగా తేనె, నిమ్మకాయ రసం వేసుకుని ఆగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
శ గ్రీన్ టీని తరచుగా తాగితే రక్తనాళాలు గట్టిపడటం, ధమనులు మూసుకుపోవడం లాంటి సమస్యలురావు. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. క్యాన్సర్ కణాలు నిర్మూలితం అవుతాయి. లివర్ వ్యాధులు, వేడి చేయడవల్ల శరీరంలో కలిగే మంటలు లాంటి వ్యాధులు టీవల్ల తగ్గుతాయి.
శ టీలో ఉన్న ఆరోగ్య లక్షణాలు తరగిపోకుండా ఉండాలంటే బ్లాక్ టీలో నిమ్మరసం కానీ, తేనె కానీ వేసుకుని తాగాలని వైద్యులు చెబుతున్నారు.
శ స్థూలకాయులు, బరువు ఎక్కువ ఉన్నవారు పాలు, చక్కెర లేని బ్లాక్‌టీ కాని, లెమన్‌టీ కాని తాగడం వల్ల బరువు తగ్గుతారు. టీవల్ల శారీరక అందం కూడా ఇనుమడిస్తుంది. చర్మానికి, జుట్టుకుకూడా టీ రక్షణనిస్తుంది.
శ నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజుకు రెండు, మూడుసార్లు హెర్బల్ టీ తాగడంవల్ల ఆ రుగ్మత నుంచి బయటపడగలుగుతారు.
శ గ్రీన్ టీ మరుగుతున్నపుడు ముఖానికి ఆవిరిపడితే చర్మంపై ఉన్న సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. ముఖం కాంతివంతమవుతుంది.
శ అన్నవాహిక సంబంధ వ్యాధులు, గ్యాస్టిక్ సమస్యలు, అండాశయ వ్యాధులు, చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్ లాంటి రుగ్మతలు టీ వల్ల తగ్గుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, మెదడును చురుకుగా చేయడం లాంటి లక్షణాలుకూడా టీకి ఉన్నాయి.
శ శారీరకంగా, మానసికంగా అలసిపోయినపుడు దాని ప్రభావం ముఖంపై ఉంటుంది. రెండు, మూడు గ్రీన్ టీ బ్యాగులను అర లీటరు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి టీ ద్రవాన్ని ముఖంపై చల్లుకుంటే అలసట తగ్గుతుంది.
శ రోజుకు రెండు, మూడు కప్పులు గ్రీన్ టీ తాగితే అధిక బరువు తగ్గుతారు.
శ గొంతు నొప్పి, అనారోగ్య కారణంవల్ల జీర్ణశక్తి తగ్గినపుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడిని ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే ఆ బాధలు తగ్గుతాయి.
శ విరేచనాలు అయినపుడు వచ్చే నీరసానికి, ఉదరానికి సంబంధించిన బాధలు ఒత్తిడి, ఆందోళన, జలుబు, తలనొప్పులను అల్లం టీ తగ్గిస్తుంది. అంతేకాక ఊపిరి పీల్చుకోవడం కష్టమైనపుడు, నోరు పిడక కట్టుకుపోయినపుడు ఒక స్పూన్ అల్లం ముద్దను ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.
శ మూడు కప్పుల నీటిలో రెండు టీ బ్యాగ్స్ వేసి మరిగించి చల్లారిన తర్వాత సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని కళ్ళకు, ముఖానికి, మెడకు రాసుకోవాలి. అయిదు పది నిముషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి. ఇలా వారం రోజులు చేస్తే ముఖంపై ఉన్న మడతలు, మచ్చలు పోతాయి.
శ షాంపుతో స్నానం చేశాక టీ డికాక్షన్‌ను తలకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. టీ డికాక్షన్‌లో వెనిగర్ కలిపి జట్టుకు రాస్తే కండిషనర్‌లా పనిచేస్తుంది.
శ సౌందర్య సాధనాల తయారీలో గ్రీన్ టీ ఆకులను, వేళ్ళను వాడతారు. టీ ట్రీ ఆయిల్‌ను కూడా కాస్మెటిక్స్ తయారీలో వాడతారు. -పి.జోత్న్సకుమారి ఆంధ్రభూమి నుండి