1911
1911 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1908 1909 1910 1911 1912 1913 1914 |
దశాబ్దాలు: | 1890లు 1900లు 1910లు 1920లు 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 10: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
- డిసెంబరు 11: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.
జననాలు
మార్చు- జనవరి 1: ఎల్లాప్రగడ సీతాకుమారి, కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
- జనవరి 17: జార్జ్ స్టిగ్లర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
- జనవరి 23: జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009)
- ఫిబ్రవరి 22: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. (మ.1980)
- ఫిబ్రవరి 24: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (మ.1983)
- మార్చి 13: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (జ.1976)
- ఏప్రిల్ 1: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (మ.1949)
- మే 2: పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.1985)
- మే 24: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006)
- మే 31: మారిస్ అలైస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూన్ 8: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (మ.1943)
- జూలై 1: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (మ.2002)
- జూలై 27: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (మ.1979)
- సెప్టెంబర్ 11: లాలా అమర్నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్తెన్.
- సెప్టెంబర్ 19: బోయి భీమన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ.
- అక్టోబర్ 2: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (మ.1997)
- అక్టోబర్ 4: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1998)
- అక్టోబర్ 12: విజయ్ మర్చంట్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- డిసెంబర్ 13: ట్రిగ్వే హవిల్మొ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
మరణాలు
మార్చు- అక్టోబర్ 13: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (జ.1867)
- డిసెంబర్ 12 : మహబూబ్ ఆలీ ఖాన్, హైదరాబాదును పాలించిన 6వ నిజాం.