2005
2005 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 2002 - 2003 - 2004 - 2005 - 2006 - 2007 - 2008 |
దశాబ్దాలు: | 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 25: గుజరాత్ లోని మంధర్ దేవి ఆలయంలో ఉత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 250మంది మరణించారు.[1]
- మే 17: కువైట్‌లో మహిళలకు ఓటుహక్కు ప్రసాదించబడింది.
- జూలై 6: 2012 వేసవి ఒలింపిక్ క్రీడలు వేదికగా లండన్ నిర్ణయించబడింది.
- జూలై 26: భారీ వర్షాల వల్ల వరదలు సంభవించి ముంబాయి లోతట్టుప్రాంతం నీటమునిగింది. 1,094 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.
- ఆగష్టు 1: సౌదీ అరేబియా రాజు ఫాద్ మృతి.
- అక్టోబర్ 13: ఫైడ్ ప్రపంచ చదరంగం చాంపియన్‌షిప్‌ను వెసెలిన్ టొపాలోవ్ గెలుచుకున్నాడు.
జననాలు
మార్చుమరణాలు
మార్చు- జనవరి 12: అమ్రీష్ పురి, భారత సినిమా నటుడు. (జ.1932)
- జనవరి 24: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (జ.1958)
- జనవరి 30: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (జ.1937)
- మార్చి 22: జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005)
- ఏప్రిల్ 13: పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (జ.1917)
- ఏప్రిల్ 25: టంగుటూరి సూర్యకుమారి, తెలుగు సినిమా నటి, గాయకురాలు. (జ.1925)
- జూన్ 7: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (జ.1920)
- జూన్ 27: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (జ.1942)
- జూలై 2: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1923)
- ఆగష్టు 15: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (జ.1927)
- సెప్టెంబర్ 6: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని నేత్రవైద్య నిపుణుడు. (జ.1920)
- సెప్టెంబరు 25: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (జ.1927)
- అక్టోబరు 31: పి.లీల, దక్షిణభారత నేపథ్యగాయని. (జ.1934)
- నవంబరు 9: కె.ఆర్. నారాయణన్, భారత మాజీ రాష్ట్రపతి. (జ.1920)
- డిసెంబర్ 24: భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (జ.1925)
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Scores killed in Indian stampede". BBC. 2005-01-25. Retrieved 2009-10-25.