వర్తుల దోష పరిధి

వికీపీడియా నుండి
02:08, 12 మార్చి 2019 నాటి కూర్పు. రచయిత: Chaduvari (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search
వర్తుల దోష పరిధి భావన. ఆరుబైట వృత్తానికి బైట 0.2%.

సైనిక పరిభాషలో వర్తుల దోష పరిధి అనేది ఆయుధ వ్యవస్థ యొక్క కచ్చితత్వాన్ని తెలిపే కొలత. ఇంగ్లీషులో సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ (సిఇపి) అంటారు. ప్రయోగించిన ఆయుధాల్లో 50% తాకిడులు జరిగే వృత్తపు (ఈ వృత్తపు కేంద్రం తాకిడుల మీన్) వ్యాసార్థం ఇది. అంటే దోషపు మీడియన్ వ్యాసార్థం అన్నమాట.[1][2] వర్తుల దోష పరిధి 100 మీ. ఉన్న ఓ ఆయుధాన్ని ఒకే లక్ష్యంపై 10 సార్లు ప్రయోగిస్తే, వాటిలో కనీసం 5 ఆయుధాలు, సగటు తాకిడి కేంద్రం నుండి 100 మీ. వృత్తం లోపల తాకుతాయి. (లక్ష్యిత బిందువుకు సగటు తాకిడి బిందువుకూ మధ్య ఉన్న దూరాన్ని బయాస్ అంటారు.)

ఆయుధ కచ్చితత్వాన్ని కొలిచే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిలో డిఆర్‌ఎమ్‌ఎస్ ఒకటి. అన్ని తాకిడుల దూరాల వర్గాల సగటును లెక్కించి, దానికి వర్గమూలం కనుక్కోవడం ఈ పద్ధతి. ఆర్95 అనేది మరొక పద్ద్ధతి: మొత్తం అన్ని తాకిడుల్లోనూ 95% పడే వృత్తపు వ్యాసార్థాన్ని ఆర్95 అంటారు.

జిపిఎస్ వంటి దిక్సూచక వ్యవస్థల కచ్చితత్వాన్ని కొలవడంలో కూడా వదోప ప్రధాన పాత్ర వహిస్తుంది.

Concept


మూలాలు

  1. Circular Error Probable (CEP), Air Force Operational Test and Evaluation Center Technical Paper 6, ver. 2, July 1987, p. 1
  2. Payne, Craig, ed. (2006). Principles of Naval Weapon Systems. Annapolis, MD: Naval Institute Press. p. 342.