దఖిని భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దఖిని్ (దఖిని హిందీ[1] లేదా దఖిని ఉర్దూ[2]) అనేది భారత దేశంలో మాట్లాడబడే హిందూస్తానీ (ఉర్దూ/హిందీ) భాష యొక్క రూపం. భారతదేశంలోని దక్షిణ ప్రాంతంకు చెందిన భాషగా ఇప్పుడు పరిగణింపబడుతుంది. దఖిని్ ప్రాథమికంగా క్రీ.శ. 14 వ శతాబ్దం నుండి క్రీ.శ. 18 వ శతాబ్దం వరకు బహమనీ, కుతుబ్ షాహి, ఆదిల్ షాహి సుల్తానుల కాలమానంంలో అభివృద్ధి చెందిన ఉర్దూ భాష యొక్క పూర్వ రూపం. తరువాత ఈ మాండలికంపై హిందీ తో పాటు ఇతర భాషల ప్రభావం కూడ చాలా ఉంది. ఢిల్లీ చుట్టూ ఉన్న ప్రదేశాలలో మాట్లాడే బ్రజ్ భాష, అవధ్ భాష, హర్యాణ్వి, పంజాబీలతో పాటు మరాఠీ, గుజరాతి ఇంకా తెలుగు, కన్నడ మొదలగు దక్షిణ భాషల ప్రభావం చాలా ఉంది. అంతే కాకుండ అరబిక్, పర్షియన్, టర్కిష్ పదాలను కూడా తీసుకొని ఒక ప్రత్యేక మాండలికంగా రూపందాల్చింది. ఇది ప్రధానంగా పర్షియన్ లిపిలో వ్రాయబడుతుంది. కవులు ప్రధానంగా ఈ భాషను 'హింద్వి', 'హిందు దఖిని' అని పిలిచేవారు. దీనిని ఒక విధంగా ఆధునిక హిందీ/ఉర్దూ కన్న ముందు వాడకంలో ఉన్న భాష అని చెప్పవచ్చు.

మూలాలు

దఖిని మాట్లాడే ప్రాతం
  1. Khan, Abdul Jamil (2006). Urdu/Hindi: An Artificial Divide: African Heritage, Mesopotamian Roots, Indian Culture & Britiah Colonialism. Algora Publishing. ISBN ISBN 978-0-87586-438-9.. {{cite book}}: Check |isbn= value: invalid character (help)
  2. Azam, Kousar J. (9 August 2017). Languages and Literary Cultures in Hyderabad. Routledge. ISBN 978-1-351-39399-7
"https://te.wikipedia.org/w/index.php?title=దఖిని_భాష&oldid=3367430" నుండి వెలికితీశారు