అక్షాంశ రేఖాంశాలు: 29°35′50″N 79°39′25″E / 29.59718°N 79.6570°E / 29.59718; 79.6570

అల్మోరా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Almora district
Clockwise from top-left: Jageshwar, Almora town, Binsar Wildlife Sanctuary, Nanda Devi from Ranikhet, Surya temple Katarmal
Location in Uttarakhand
Location in Uttarakhand
పటం
Almora district
Coordinates: 29°35′50″N 79°39′25″E / 29.59718°N 79.6570°E / 29.59718; 79.6570
Country India
Stateదస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
DivisionKumaon
ముఖ్యపట్టణంAlmora
విస్తీర్ణం
 • Total3,082 కి.మీ2 (1,190 చ. మై)
Elevation
1,646 మీ (5,400 అ.)
జనాభా
 (2011)
 • Total6,22,506
 • జనసాంద్రత200/కి.మీ2 (500/చ. మై.)
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
263601
Telephone code91-5962
Vehicle registrationUK-01
ClimateAlpine (BSh) and Humid subtropical(Bsh) (Köppen)
Annual temperature28 to -2 °C
Summer temperature28 - 12 °C
Winter temperature15 to -2 °C

అల్మోరా జిల్లా, భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లా, ఈ జిల్లా ముఖ్యపట్టణం అల్మోరా.

అల్మోరా 1568 సంవత్సరంలో స్థాపించబడింది.[1] అల్మోరా పట్టణం చారిత్రాత్మక, సాంస్కృతిక కేంద్రం. ఇది కుమాన్ ప్రాంతానికి ముఖ్యమైన కేంద్రం.

చరిత్ర

[మార్చు]

అల్మోరా స్థాపనకు ముందు కట్యూరీ రాజులలో ఒకరైన భయాచల్డియో వశంలో ఉంటూవచ్చింది. రాజా తన భాభాగంలోని అత్యధిక భాగం గుజరాతి బ్రాహ్మణుడైన చంద్ తివారీకి దానంగా ఇచ్చాడు.[2] తరువాత బరమండలం ‌లో చంద్ రాజ్యం స్థాపించబడింది. 1568లో చంద్ రాజ్యం కేంద్రభాగంలో కల్యాణ్ చంద్ ఆధ్వర్యంలో అల్మోరా నగరం నిర్మాణం జరిగింది.[1] [ఆధారం చూపాలి] చంద్ వంశరాజుల కాలంలో అల్మోరాను రాజ్పూర్ అని పిలువబడింది. రాజ్పూర్ అనే పేరు పలు రాగిపళ్ళాల మీద సూచించబడింది. అప్పటి కుమాన్ రాజా అయిన " రాజా మహేంద్ర చంద్ ఆఫ్ లమాఖెట్ " రాణి " గితా చంద్ "ను వివాహం చేసుకున్నాడు. వారికి రాజకుమారి అకాంక్షా చంద్, రాజకుమారి మల్లికా చంద్ రాజకుమారుడు ఆర్యన్ చంద్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. 1969లో భాగేశ్వర్, పితోర్‌ఘర్ , చంపావత్ రూపొందక ముందు అవి అల్మోరాలో భాగంగా ఉంటూ వచ్చాయి.[3]

భౌగోళికం

[మార్చు]

అల్మొరా భౌగోళికంగా 29°37′N 79°40′E / 29.62°N 79.67°E / 29.62; 79.67.[4] ఇక్కడ ఉంది. ఇది సుమారు 1,651 మీటర్లు (5,417 అడుగులు) ఎత్తులో హిమాలయ ప్రాంతపు కుమాన్ పర్వతాలకు దక్షిణంగా ఉంది. ఒక గుర్రపు నాడా ఆకారంలోని గుట్ట చుట్టూ దట్టమైన పైన్ అడవులతో, మధ్యనుండి ప్రవహించే కోశి నది అత్యంత సుందరంగా ఉంటుంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో అల్మోరా ఒక మునిసిపల్ బోర్డ్, కంటోన్మెంట్. అల్మోరా నగరం 1568లో స్థాపించబడింది.[1] ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కుమాన్ భాభాగానికి అల్మోరా సాంస్కృతిక కేంద్రంగా ఉంది.

నిర్వహణా విభాగాలు

[మార్చు]

అల్మోరా జిల్లా అల్మోరా, భికియాసిన్, చౌఖుటియా, ద్వారాహట్, జైంతి, రాణిఖెట్, సోమేశ్వర్ , సుల్త్ అనే 9 తాలూకాలుగా విభజించబడింది.

సంస్కృతి , సాహిత్యం

[మార్చు]

అల్మోరాలో 1983లో నృత్యకారుడు ఉదయశంకర్ ఆధ్వర్యంలో నాట్యశిక్షణాలయం ప్రారంభించబడింది. ఇక్కడ పలు ప్రఖ్యాత భారతీయ , ఫ్రెంచ్ కళాకారులు నృత్యం అభ్యసించారు. అల్మోరా నాట్యశిక్షణాలయ వసతి గృహం నగరానికి దూరంగా రాణిద్వారా వద్ద ఉన్న పైన్ లాడ్జ్ వద్ద ఏర్పాటు చేయబడింది. ఇక్కడి నుండి హిమాలయాలు అరియు నగర దృశ్యలను చూడడానికి అవకాశం ఉంది.

గణాంకాలు

[మార్చు]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 30,613
పురుషులు 16,443 (53.7%)
స్త్రీలు 14,170 ( 46.3%)
6 సంవత్సరాల లోపు పిల్లలు 10%
అక్షరాస్యత శాతం 84.09%
పురుషుల అక్షరాస్యత 86.39%
స్త్రీల అక్షరాస్యత 81.43%
జాతియ సరాసరి (72%) కంటే అధికం

2011 గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జనసంఖ్య 621,927.
స్త్రీ పురుష నిష్పత్తి 1142 : 1000
జాతీయ సరాసరి 928 కంటే అధికం

వాఖ్య

[మార్చు]
Almora, 1860s

" అల్మోరాలో 3 వారాలు గడిపిన తరువాత " ప్రజలు ఆరోగ్యం కొరకు ఐరోపా ఖండానికి ఎందుకు పోతారో తెలియక ఆశ్చర్యపోయాను. ఈ కొండలలోని ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం, సౌందర్యం చేసే సేవ మానవులెవ్వరూ అందించలేరు. ప్రపంచంలో మరే ప్రాంతం ఈ ప్రాంతం సౌందర్యంతో సరి తూగదు " మహాత్మా గాంధి " [5]

సుప్రసిద్ధ వ్యక్తులు

[మార్చు]
Almora Bazaar, c1860
  • మనోహర్ శ్యామ్ జోషి (1933-2006) రచయిత. . అల్మోరా
  • సుమిత్ర నందన్ పంత్ ... రచయిత. అల్మోరా. [6]
  • జనరల్ బి.సి. జోషి భారత సైన్యంలో సాధారణ అల్మోరాలో జన్మించాడు. [6]
  • లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఎం.సి భండారీ, పి.వి.ఎస్.ఎం, ఎ.వి.ఎస్.ఎం & బార్, డి లిటరేచర్, రాణిఖెట్లో జన్మించారు ఎఫ్.ఐ.ఎం.ఎ గత ఛైర్మన్ యు.కె.డి పబ్ సర్వీస్ కమిషన్.
  • జగ్మోహన్ సంద్రియాల్, డైరెక్టర్ (వ్యాపార), రాజ్యసభ, భారతదేశ పార్లమెంట్ సభ్యుడు.
  • ప్రసూన్ జోషి: రచయిత కవి
  • అడ్మిరల్ డి.కె జోషి (భారత నౌకాదళ చీఫ్)
  • మురళీ మనోహర్ జోషి (భారతదేశం మాజీ మానవ వనరుల అభివృద్ధి మంత్రి)
  • భారతరత్న "గోవింద్ వల్లభ్ పంత్" (యు.పి మొదటి ముఖ్యమంత్రి).
  • డాక్టర్ డి.కె. పాండీ, వారణాసి డాక్టర్.

ఆధ్యాత్మిక ముఖ్యత్వం

[మార్చు]
  • స్వామి వివేకానంద స్వామి వివేకానంద హిమాలయ పర్యటనలో కొంతకాలం అల్మోరాలో నివసించాడు. ఆయన ఇక్కడ ఆశ్రమం నెలకొల్పి అద్వైతసిద్ధాంతాన్ని ప్రచారం చేయాలని అత్యంత ఆసక్తి కనబరిచాడు.
  • బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, రిక్షియాపీఠానికి చెందిన స్వామి సత్యానంద సరస్వతి అల్మోరాలో 1923 డిసెంబరు 25 న జన్మించాడు. ఆయన జమిందారి కుటుంబానికి చెందిన బికియాసేన్, గజలకు జన్మించడు.
  • ప్రఖ్యాత స్వాతంత్ర్యసార యోధుడు, కుమాన్ పరిషద్ స్థాపకుడు, పార్లమెంటు సభ్యుడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉప సభాపతి అయిన హర్ గోవింద్ వల్లభ్ పంత్ (1885 నుండి 1858)
  • ప్రఖ్యాత ఐ.సి.ఎస్ అధికారి, అత్యధికకాలం క్యాబినెట్ సెక్రెటరీగా పనిచేసిన (1972 to 1977), పంజాబు గవర్నరు బి.డీ పాండీ, అల్మోరా.
  • గోవింద్ వల్లభ్ పంత్ (1887 ఆగస్టు 30 - 1961 మార్చి 7), గుర్తింపు పొందిన స్వాతంత్ర్య సమరవీరుడు & ఉత్తర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, అల్మోరా.
  • ప్రముఖ హిందీ ఆధునిక కవి సుమిత్రానందన్ పంత్, (1900 మే 20 – 1977 డిసెంబరు 28) కుమాన్ పర్వతాలలోని భాగేశ్వర్ సమీపంలో ఉన్న కౌసానీ గ్రామంలో జన్మించారు.
  • మలేరియా పారాసైట్‌ను నిర్మూలించడానికి " పాత్ బ్రేకింగ్ డిస్కవరీ " కొరకు నోబుల్ బహుమతి విజేత శ్రీ రోనాల్డ్ రాస్, అల్మోరా
  • అమెరికన్ నటి " ఉమా తర్మన్ " తన బాల్యంలో అధికభాగం అల్మోరాలోని " క్రాంక్‌రిడ్జ్ " వద్ద గడిపింది. ఆమె తల్లి తండ్రులు కొంతకాలం ఇక్కడ నివసించారు.
  • పాటల రచయిత ప్రసూన్ జోషి, కళాకారుడు శంకర్, మోహన్ అప్రెట్ అలాగే పలు కళారంగ రత్నాలు అల్మోరాతో సంబధం కలిగి ఉన్నారు.
  • ఇండియన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని తండ్రి 1964లో రాంచిలో స్థిరపడే ముందు ఆయనకు ఇక్కడ ఒక తోట ఉండేది.
  • బీగం రాణా లియాక్వత్ అలీ ఖాన్ (నీ షియల ఇరెనే పంత్) (1905 - 1990 జూన్ 13) క్రైస్తవులుగా మారిన హిందూ కుటుంబంలో అల్మోరాలో జన్మించింది. ఆమె పాకిస్తాన్ ప్రథమ ముఖ్యమంత్రి " లియాఖత్ ఆలీ ఖాన్ "ను వివాహం చేసుకున్నది.
  • " ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ " (సి.పి.ఐ) మొదటి చైర్మెన్ " పి.సి జోషి " జన్మస్థానం అల్మోరా.
  • " చీఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ "గా పని చేసిన బి.సి జోషి, జనరల్ భువన్ చంద్ర జోషి, పి.వి.ఎస్.ఎం, ఎ.వి.ఎస్.ఎం, ఎడి.సి, (పుట్టుక: 1935, మరణం: నవంబర్ 19, 1994) అల్మోరా జిల్లాలోని తాల్లాదానియాలో జన్మించాడు.
  • ఎన్.డి.ఎ ప్రభుత్వంలో " మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి "గా పనిచేసిన మురళీ మనోహర్ జోషీ, (జననం: 1934 జనవరి 5)
  • సంగీత కళాకారుడు ఆనంద శంకర్.
  • పాటల రచయిత జోషి.

ఆలయాలు

[మార్చు]

అల్మోర కొండలనుండి కనిపించే మంచుతో నిండిన హిమాలయాల శిఖరాలను పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ సుందర ప్రదేశం సందర్శినడానికి ప్రతిసంవత్సరం ప్రపచమంతటి నుండి అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాసర్ దేవి టెంపుల్, నందా దేవి దేవాలయం, చితి దేవాలయం, కాతర్మాల్ సూర్య దేవాలయం వంటి భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ కల ప్రాచీనమైన నందా దేవి ఆలయాన్ని కుమావొనీ శిల్ప శైలిలో నిర్మించారు. ఈ ఆలయంలో చాంద్రవంశం పూజించిన దేవత ప్రతిష్ఠితమై ఉంది. ప్రతి సంవత్సరం భక్తులతో దేవాలయం నిండిపోతూ ఉంటుంది. అల్మోరకు 5 కి.మీ.ల దూరంలో ఉన్న కాసర్ దేవి ఆలయాన్ని 2 వ శతాబ్దంలో నిర్మించారు. స్వామి వివేకానంద తన తపస్సును ఇక్కడ చేసారని ప్రజలు విశ్వసిస్తున్నారు. బ్రైట్ ఎండ్ కార్నర్ నుండి పర్యాటకులు అందమైన సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు చూడవచ్చు. సిమ్టోల, మర్టోల ప్రదేశాలు విహారానికి అనువుగా ఉంటాయి.. అల్మోర నగరం నుండి 3 కి. మీ.ల దూరంలో ప్రసిద్ధి చెందిన జింకల పార్క్ ఉంది. దీనిలో అనేక లేళ్ళు, చిరుతలు హిమాలయ బ్లాకు బేర్ వంటివి ఉన్నాయి. ఈ ప్రదేశంలో కల గోవింద్ వల్లభ పంత్ మ్యూజియం, బిన్సార్ వన్యమృగసంరక్షణాలయం పర్యాటక ఆకర్షణ ప్రదేశాలలో ఒకటి. . ఇక్కడకు వచ్చే పర్యాటకులను ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్‌లు అధికంగా ఆకర్షిస్తుంది . ఈ ప్రదేశానికి వాయు, రైలు, రహదారి మార్గాలలో తేలికగా చేరవచ్చు. పంత్ నగర్ ఎయిర్ పోర్ట్, కతోగోడం రైల్వే స్టేషను అల్మోరకు సమీపం. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.

View of Almora, with soldiers of 3rd Gurkha Rifles, 1895.
  • నందాదేవి ఆలయం కుమావొనీ ప్రాంతంలో ఉంది. నందాదేవి ఆలయం చాలా ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయం చరిత్ర వేయి సంవత్సరాల నాటిది. ఈ ఆలయంలో కల నందా దేవిని చాంద్ వంశ పాలకులు కొలిచారు. దీనిని శివాలయం పురాతన కుమావొనీ శిల్ప శైలిలో నిర్మించారు. గుడి గోడలు ఆకర్షణీయ కుడ్యచిత్రాలతో ఆకర్షణీయంగా వుంటాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెలలో నందా దేవి జాతర నిర్వహిస్తారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.
  • కాసర్ దేవి ఆలయం అల్మోరకు 5 కి. మీ. ల దూరంలో ఉంది. దీనిని 2 వ శతాబ్దంలో నిర్మించారు. 1970 నుండి 1980 ల వరకు ఇది డచ్ సన్యాసి ఒకరికి నివాసంగా వుండేది. ఈ ఆలయం వద్ద హవబగ్ వాలీ ఉంది. స్వామి వివేకానంద ఈ ప్రదేశంలో కొంత కాలం ధ్యానం చేసారని కథనాలు వివరిస్తున్నాయి.. కాలిమాట్ నుండి ఈ ఆలయానికి కాలి నడకన చేరవచ్చు. అల్మోర నుండి బాడుగ బస్సు లు, టాక్సీలు తరచుగా లభిస్తుంటాయి.
  • అల్మోరకు 2 కి.మీ.ల దూరంలో బ్రైట్ ఎండ్ కార్నర్ అనే ఆకర్షణీయమైన ప్రదేశం ఉంది. పర్యాటకులు ఇక్కడ నుండి మంచు శిఖరాల మధ్య జరిగే సూర్యోదయ సూర్యాస్తమయాలు దృశ్యాలు చూసి ఆనందించవచ్చు. అలాగే చంద్రోదయం కూడా చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశానికి లార్డ్ బ్రిటన్ పేరు ఉంది. ఇక్కడ నుండి మాల్ రోడ్ మొదలవుతుంది. ఇక్కడే " శ్రీ రామకృష్ణ కుటీర్ ఆశ్రమం " ఉంది. . ఇక్కడకు ధ్యానం కొరకు ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబరు నుండి నవంబరు వరకూ రావచ్చు. ఇక్కడ వివేకానంద లైబ్రరీ, ఒక మెమోరియల్ కూడా ఉన్నాయి. స్వామి వివేకానంద తన హిమాలయ పర్యటనలో ఈ ప్రదేశంలో కొద్దిసేపు విశ్రాంతి పొందారు.
  • సింటోలా వద్ద ఒక గ్రానైట్ కొండ, వజ్రాల గని ఉన్నాయి.. ఈ ప్రదేశం నుండి సుందరమైన పైన్, దేవదార్ వృక్షాలతో కూడిన పర్వత శ్రేణులను చూడవచ్చు. ఈ పిక్నిక్ ప్రదేశం అల్మోరకు 3 కి.మీ.ల దూరంలో ఉంది. ఇది హార్స్ షూ రిజ్ కు ఎదురు భాగంలో వుంటుంది.
  • అల్మోరకు 10 కి.మీ.ల దూరంలో కల ఒక పిక్నిక్ స్పాట్ మర్టోల. ఇది పచ్చని అడవులకు, తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ అనేక మంది విదేశీయులు తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. ఈ ప్రదేశానికి చేరాలంటే పనువనౌళ నుండి కాలి నడకన చేరాలి.
  • " బిన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి " ( వన్యమృగ శరణాలయం) అల్మోర టవున్‌కు 30 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ వన్యమృగ శరణాలయం 45.59 చ.కి.మీ.ల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 900 నుండి 2500 మీ.ల ఎత్తున ఉంది. ఎన్నో రకాల జంతువులకు ఇది సహజ నివసిస్తున్నాయి. దీనిలో 200 రకాల పక్షులు, వివిధ జాతుల మొక్కలు కూడా కూడా ఉన్నాయి.
  • అల్మోర చేరే పర్యాటకులకు ట్రెక్కింగ్ చేసే అవకాశం ఉంది. ఈప్రదేశం నుండి సుమారు 5 కి.మీ.ల దూరంలో ఉన్న అల్మోర పర్వత శ్రేణుల దృశ్యాలు కనపడతాయి. అల్మోర నుండి జగేస్వర్ కు మార్గం బాగుంటుంది. ఈ మార్గంలో ట్రెక్కర్లు కుమావొనీ గ్రామాల గుండా వెళతారు. ఈ ట్రెక్ లో జగేశ్వర్ టెంపుల్ కాంప్లెక్స్, వ్రిద్ జగేశ్వర్ లు ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ నుండి కాసర్ దేవి ఆలయాలను కూడా వెళ్ళవచ్చు. ట్రెక్కింగ్ కు అక్టోబరు నుండి మార్చి వరకూ అనుకూలం. సాహసికులకు పిండారీ ట్రెక్ సూచించ దగినది. ఈ మార్గం అడవులు, లోయల గుండా వెళుతుంది. పిండారీ గ్లేసియర్ నంద దేవి, నందాకోట్ పర్వతాల మధ్య ఉంది.
  • మౌంటెన్ బైకింగ్ అనేది కొత్త క్రీడ. దీనికిగాను అల్మోర కొండలపై అనేక మార్గాలు ఉన్నాయి . ఆసక్తి కల పర్యాటకులు సైకిళ్ళు అద్దెకు తీసుకుని బైకింగ్ చేసి ఆనందిస్తారు.. బైకింగ్ పర్యటనలు నిర్వహించే వారు అల్మోర, పురుగు ప్రాంతాలలో పలువురు ఉన్నారు.

పాలనా నిర్వహణ

[మార్చు]

జిల్లా పాలన బాధ్యతను మెజిస్ట్రేట్ నిర్వహిస్తాడు. మెజిస్ట్రేట్ సివిల్ సర్వీస్ ఉద్యోగులందరికీ నాయకత్వం వహిస్తాడు. మెజిస్ట్రేట్‌కు పబ్లిక్ లా, పాలనా నిర్వహణ సంబంధిత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. జిల్లా మెజిస్ట్రేట్‌కు సహాయగా అడిషనల్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్, సబ్ డివిషనల్ మెజిస్ట్రేట్లు ఒక్కోజిల్లాకు ఉంటారు. ప్రస్తుతం అల్మోరాలో 9 పాలనా విభాగాలు ఉంటాయి.

ప్రయాణవసతులు

[మార్చు]

వాయుమార్గం

[మార్చు]

సమీప విమానాశ్రయం

  • ఉప పంత్నగర్ (నైనిటాల్) : 127 కి.మీ .
  • గర్ విమానాశ్రయం 125 కి.మీ

రైలు

[మార్చు]

అల్మోరాకు 90 కి.మీ దూరంలో ఉన్న కోత్గోడం నుండి లక్నో, ఢిల్లీ, ఆగ్రాలకు నేరుగా ప్రయాణం చెయ్యడానికి రైలు వసతి ఉంది. ప్రధాన రైళ్ళు కొన్ని:

  • సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (5035/506)
  • హౌరా ఎక్స్‌ప్రెస్ (3019/3020)
  • రాణిఖెట్ ఎక్స్‌ప్రెస్ (5013/5014)
  • రాంపూర్ ప్యాసింజర్ (1/2 ఆర్.కె. ప్యాసింజర్ 3/4 ఆర్.కె. ప్యాసింజర్)
  • నైనీతాల్ ఎక్స్‌ప్రెస్ (5308/5307)
  • గరీబ్ రథ్ (వీక్లీ)

రోడ్

[మార్చు]

అల్మోరా తక్కువ ఉత్తమం region.Nh 87 లో ముఖ్యమైన సెంటర్లకు చేరవచ్చు karnaprayag జాతీయ HIGHWAY పిలుస్తారు అల్మోరా ఉప throgh వెళుతుంది. కొన్ని దూరం:

  • ఢిల్లీ (378 కి.మీ కి.మీ )
  • లక్నో (454 కి.మీ కి.మీ )
  • నైనిటాల్ (63 కి.మీ ) (రాణిఖెట్ ద్వారా 103 కి.మీ )
  • కోత్గోడం (86 కి.మీ )
  • హాల్డ్వాని 91 కి.మీ
  • రాంనగర్ 120 కి.మీ (నైనిటాల్ ద్వారా) 150 కి.మీ
  • కౌసాని ద్వారా బాగేశ్వర్ 74 కి.మీ 0.92 కి.మీ
  • రుద్రాపూర్ 130 కి.మీ
  • రాణిఖెట్ 45 కి.మీ
  • ద్వరాహత్ 68 కి.మీ
  • గర్ 120 కి.మీ
  • బారెల్లీ 191 కి.మీ
  • డెహ్రాడూన్ 394 కి.మీ

ఇవికూడా చూడండి

[మార్చు]
  • Rivett-Carnac, J. H. (1879). Archaeological notes on ancient sculpturings on rocks in Kumaon, India. Calcutta : G.H. Rouse.
  • Upreti, Ganga Dutt (1894). Proverbs & folklore of Kumaun and Garhwal. Lodiana Mission Press.
  • Oakley, E Sherman (1905). Holy Himalaya; the religion, traditions, and scenery of Himalayan province (Kumaon and Garwhal). Oliphant Anderson & Ferrier, London.
  • of Kumaon, Raja Rudradeva (1910). Haraprasada Shastri (ed.). Syanika sastra: or A Book on Hawking. Asiatic Society, Calcutta.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Almora history". Archived from the original on 2008-10-14. Retrieved 2008-12-26.
  2. Kumaon Official website of Almora district
  3. Times World Atlas, 1967 Edition, Plate 30.
  4. Falling Rain Genomics, Inc - Almora
  5. "The Collected Works of Mahatma Gandhi Vol. 46: 12 May 1929 - 31 August 1929" (PDF). Archived from the original (PDF) on 8 మార్చి 2013. Retrieved 11 ఏప్రిల్ 2013., p. 254
  6. 6.0 6.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; foundationsaarcwriters1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లింకులు

[మార్చు]