ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
నైట్ కమాండర్
ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్
ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్
1955లో స్టూడియో పబ్లిసిటీ కోసం తీసిన ఫోటో.
జననం
ఆల్‌ఫ్రెడ్ జోసెఫ్ హిచ్‌కాక్

(1899-08-13)1899 ఆగస్టు 13
లేటన్ స్టోన్, ఎసెక్స్, ఇంగ్లాండ్
మరణం1980 ఏప్రిల్ 29(1980-04-29) (వయసు 80)
బెల్ ఎయిర్, కాలిఫోర్నియా, అమెరికా
ఇతర పేర్లుహిచ్, ద మాస్టర్ ఆఫ్ సస్పెన్స్
విద్యాసంస్థ
  • సలేషియన్ కాలేజ్, London
  • సెయింట్ ఇగ్నేషియస్ కాలేజ్, ఎన్ ఫీల్డ్
వృత్తిసినిమా దర్శకుడు, సినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1921–76
జీవిత భాగస్వామిఅల్మా రేవిల్లె (m. 1926–80; his death)
పిల్లలుపాట్ హిచ్‌కాక్

సర్ ఆల్‌ఫ్రెడ్ జోసెఫ్ హిచ్‌కాక్, (నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్) (1899 ఆగస్టు 13 – 1980 ఏప్రిల్ 29) [2] ఆంగ్ల చలనచిత్ర దర్శకుడు, నిర్మాత.[3] ఆయనకు తన శైలి  కారణంగా  "మాస్టర్ ఆఫ్ సస్పెన్స్" అన్న మారుపేరు ఉంది, [4] సినిమాల్లో సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ జాన్రాలో పలు అంశాలకు ఆయనే ఆద్యులు. ఇంగ్లాండ్ లో మూకీలు, తొలినాళ్ళ టాకీలలో విజయవంతమైన కెరీర్ తర్వాత ఆయన ఇంగ్లాండ్లో అత్యుత్తమ డైరెక్టర్ గా పేరు పొంది, 1939లో హాలీవుడ్ కు పయనమయ్యారు, 1955లో అమెరికన్ పౌరసత్వం పొందారు. ఆయన 1939 తర్వాత హాలీవుడ్ లో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకునిగా, నిర్మాతగా అక్కడ స్థిరపడ్డారు.

అర్థశతాబ్దం పాటు కొనసాగిన సుదీర్ఘ కెరీర్లో, హిచ్‌కాక్ తనకంటూ ప్రత్యేకమైన దర్శకత్వ శైలిని ఏర్పరుచుకున్నారు.[5] ఆయన ట్రేడ్ మార్కులా పేరొందిన శైలిలో వాయెరిజమ్ (రహస్యంగా వేరే వ్యక్తి ఏకాంతంలో ఉన్నప్పుడు చూడడం) లో ప్రేక్షకులను భాగం చేస్తూ ఆ పనిచేస్తూన్న పాత్రలు చూసే చూపును, కళ్ళు కదలడాన్ని అనుకరించే కెమెరా కదలికలు వంటివి వున్నాయి.[6] ఫిల్మ్ ఎడిటింగ్ లో వినూత్నమైన విధానాలు, ప్రత్యేకించి రూపొందించిన షాట్ ల ద్వారా ఆత్రుత, భయం, సహానుభూతి వంటి అనుభూతులను శిఖరప్రాయమైన స్థితికి తీసుకువెళ్ళారు.[6] బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ లోలోపల రగిలిపోతున్న ఐసీ బ్లాండ్ గా పేరుపడ్డ కథానాయిక పాత్రలు ఆయన సినిమాల్లో చాలాసార్లు చోటుచేసుకున్నాయి.[7][8] హిచ్‌కాక్ తీసిన చాలా సినిమాల్లో హత్య, నేరం వంటివి చూపిస్తూ మెలికతో కూడినవీ, థ్రిల్ కలుగచేసేవీ అయిన ముగింపులు ఉంటాయి. హిచ్‌కాక్ సినిమాల్లోనూ మనోవైజ్ఞానిక విశ్లేషణ (సైకోఅనాలసిస్) కి సంబంధించిన అంశాలను స్వీకరించడం, కొన్నికొన్ని సార్లు అంతర్లీనమైన బలమైన సెక్స్ సంబంధిత అంశాలను చూపించడం వంటివి చేశారు.ఇంటర్వ్యూలు, మూవీ ట్రైలర్లు, తన సినిమాల్లోని అతిథి పాత్రలు, పదేళ్ళ పాటు నిర్వహించిన ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ప్రెజంట్స్ అనే టీవీ కార్యక్రమం వంటివాటి ద్వారా అప్పట్లో అత్యంత ఎక్కువగా కనిపిస్తూ ప్రాచుర్యం  పొందిన వ్యక్తిగా నిలిచారు.

హిచ్‌కాక్ అరవై దశాబద్దాల పాటు కొనసాగిన తన కెరీర్లో దాదాపు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తరచుగా బ్రిటీష్ సినిమా రూపకర్తల్లో అత్యంత గొప్పవాడిగా ఆయనను పేర్కొంటూంటారు, [9]  బ్రిటన్ కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ పత్రిక నిర్వహించిన 2007 నాటి సినీ విమర్శకుల పోల్ అనంతరం ఆయన గురించి: "(ఆయన) ఈ దీవుల (ఇంగ్లాండ్) నుంచి వచ్చిన అత్యంత గొప్ప సినీరూపకర్త అనడంలో సందేహంలేదు, ఆధునిక సినిమాకు రూపం ఇవ్వడంలో మరే ఇతర దర్శకుడు చేసినదానికన్నా హిచ్‌కాక్ ఎక్కువ చేశారు, ఆయన లేకుంటే ఆధునిక సినిమా రూపం పూర్తిగా వేరేలావుండేది. కథ చెప్పడంలో, కీలకమైన సమాచారాన్ని నిర్దాక్షిణ్యంగా దాయడంలో (ప్రేక్షకుల నుంచీ, పాత్రల నుంచీ కూడా), ప్రేక్షకుల భావోద్వేగాలు కావాల్సిన విధంగా మలచడంలో ఆయన నైపుణ్యానికి సాటి వేరెవరూ లేరు." అని అన్నారు.[10][11] 2002లో మూవీమేకర్ పత్రిక హిచ్‌కాక్ సర్వకాలాలకు అత్యంత ప్రభావశాలియైన సినీరూపశిల్పిగా పేర్కొంది.[12]

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Hamilton, Fiona. "PM hails Christian influence on national life". The Times. Retrieved 25 June 2013.{{cite news}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  2. Mogg, Ken. "Alfred Hitchcock". Senses of Cinema. Sensesofcinema.com. Archived from the original on 28 March 2010. Retrieved 9 September 2015.
  3. "Obituary". Variety. 7 May 1980.
  4. Moerbeek, Kees (2006). Alfred Hitchcock: The Master of Suspense. Simon & Schuster. ISBN 978-1-4169-0467-0.
  5. Lehman, David (April–May 2007). "Alfred Hitchcock's America". American Heritage. Archived from the original on 27 December 2009. Retrieved 9 September 2015.
  6. 6.0 6.1 Bays, Jeff (December 2007). "Film Techniques of Alfred Hitchcock". Borgus.com. Archived from the original on 3 October 2019. Retrieved 9 September 2015.
  7. Whitington, Paul (18 July 2009). "NOTORIOUS! (Hitchcock and his icy blondes)". The Irish Independent. Retrieved 13 July 2010.
  8. Dowd, Maureen (1 December 2012). "Spellbound by Blondes, Hot and Icy". The New York Times. Retrieved 13 November 2013.
  9. "The Directors' Top Ten Directors". British Film Institute. Archived from the original on 14 May 2011. Retrieved 10 May 2011.
  10. Avedon, Richard (14 April 2007). "The top 21 British directors of all time". The Daily Telegraph. Retrieved 8 July 2009. Unquestionably the greatest filmmaker to emerge from these islands, Hitchcock did more than any director to shape modern cinema, which would be utterly different without him. His flair was for narrative, cruelly withholding crucial information (from his characters and from the audience) and engaging the emotions of the audience like no one else.
  11. "British Directors". RSS Film studies. Archived from the original on 17 February 2010. Retrieved 11 June 2008.
  12. Wood, Jennifer (6 July 2002). "The 25 Most Influential Directors of All Time". MovieMaker. Moviemaker.com. Archived from the original on 8 June 2011. Retrieved 9 September 2015.