ఊరంతా అనుకుంటున్నారు
ఊరంతా అనుకుంటున్నారు | |
---|---|
దర్శకత్వం | బాలాజీ సానల |
రచన | రమ్య గోగుల శ్రీహరి మంగళంపల్లి బాలాజీ సానల |
నిర్మాత | శ్రీహరి మంగళంపల్లి రమ్య గోగుల పి.ఎల్.ఎన్. రెడ్డి |
తారాగణం | నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ |
ఛాయాగ్రహణం | జీ.ఎల్. బాబు |
కూర్పు | మధు |
సంగీతం | కె. ఎం. రాధాకృష్ణన్ |
నిర్మాణ సంస్థ | రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 5 అక్టోబరు 2019 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఊరంతా అనుకుంటున్నారు 2019, అక్టోబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డిల నిర్మాణ సారథ్యంలో బాలాజీ సానల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ తదితరులు నటించగా, కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు.
నటవర్గం
[మార్చు]- నవీన్ విజయ్ కృష్ణ (మహేష్)
- శ్రీనివాస్ అవసరాల (శివ రామన్ అయ్యర్)
- మేఘా చౌదరి (గౌరీ)
- సోఫియా సింగ్ (మాయ)
- జయసుధ (లీలావతి)
- రావు రమేశ్ (శివనాయుడు)
- కోట శ్రీనివాసరావు (ఊరి పెద్ద)
- అశోక్ కుమార్ (అయ్యర్ తండ్రి)
- రాజా రవీంద్ర (పోలీస్ ఇన్స్పెక్టర్)
- గౌతంరాజు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: బాలాజీ సానల
- నిర్మాత: శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి
- రచన: రమ్య గోగుల, శ్రీహరి మంగళంపల్లి, బాలాజీ సానాల
- సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
- ఛాయాగ్రహణం: జీ.ఎల్. బాబు
- కూర్పు: మధు
- నిర్మాణ సంస్థ: రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాణం
[మార్చు]2016లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాలో నటించిన నవీన్ విజయ్ కృష్ణ (నటుడు నరేష్ కుమారుడు) ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు, ఈ చిత్ర ట్రైలర్ ఎడిటర్‌గా కూడా పనిచేశాడు.[1] శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, కొత్తగా నటి సోఫియా సింగ్ ఇతర పాత్రలను పోషించారు.[2] రెండు జంటల ప్రేమ కథలలో ఈ చిత్రం రూపొందింది.[3] 2018, జనవరి 22న చిత్రీకరణ ప్రారంభమైంది.[4] ఈ చిత్రాన్ని పాలకొల్లులో, లక్ష్మీ పార్వతి ఇంట్లో చిత్రీకరించారు.[1][5] జయసుధ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.[1]
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు. రాశి ఖన్నా ఈ చిత్రంలో 'కన్నా' అనే పాటను పాడింది.[6]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కన్నా (రచన: వనమాలి)" | వనమాలి | కె. ఎం. రాధాకృష్ణన్, కె.ఎస్. చిత్ర | 4:45 |
2. | "అలవాటులో లేని (రచన: శ్రీహరి మంగళంపల్లి)" | శ్రీహరి మంగళంపల్లి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత ఉపద్రష్ట | 3:36 |
3. | "నీ రొంబా రొంబా (రచన: శ్రీహరి మంగళంపల్లి)" | శ్రీహరి మంగళంపల్లి | మనీషా ఎర్రబత్తిని | 2:51 |
4. | "మ్యారేజేస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ (రచన: పెద్దాడ మూర్తి)" | పెద్దాడ మూర్తి | పవన్, వైష్ణవి | 3:21 |
5. | "ఆటను ఆడుతున్నదేవరో (రచన: శ్రీహరి మంగళంపల్లి)" | శ్రీహరి మంగళంపల్లి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 3:49 |
6. | "కన్నా (రచన: వనమాలి)" | వనమాలి | రాశి ఖన్నా, అనురాగ్ కులకర్ణి | 3:20 |
మొత్తం నిడివి: | 21:42 |
విడుదల
[మార్చు]ఈ చిత్రాన్ని 2019, మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. అక్టోబరు 5న విడుదలయింది.[7][8] దసరా పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలయింది.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Chowdhary, Y. Sunita (3 October 2019). "Naveen Vijay Krishna's long road to limelight". The Hindu. Retrieved 8 December 2020.
- ↑ India, The Hans (24 September 2019). "Naresh's son testing his luck". The Hans India. Archived from the original on 6 November 2020. Retrieved 8 December 2020.
- ↑ Pecheti, Prakash. "Playing Telugu conservative girl was all fun: Megha". Telangana Today. Archived from the original on 6 November 2020. Retrieved 8 December 2020.
- ↑ "ఊరంతా అనుకుంటున్నారు". Sakshi. 17 January 2018. Archived from the original on 6 November 2020. Retrieved 8 December 2020.
- ↑ kavirayani, suresh (24 May 2018). "Naresh's son Naveen Vijay Krishna signs a new film". Deccan Chronicle. Archived from the original on 23 April 2019. Retrieved 8 December 2020.
- ↑ "Raashi Khanna hums the song Kanna for Oorantha Anukuntunnaru". The Times of India. Retrieved 8 December 2020.
- ↑ "నరేశ్ కొడుకు సినిమా.. మహేశ్ ప్రచారం". Samayam Telugu. Archived from the original on 6 November 2020. Retrieved 8 December 2020.
- ↑ "వెనక్కి వెళ్లేది లేదు". Sakshi. 5 October 2019. Retrieved 8 December 2020.
- ↑ "Oorantha Anukuntunnaru is slated for Dussehra release". The Times of India. Retrieved 8 December 2020.
- ↑ "'ఊరంతా అనుకుంటున్నారు' అందరికీ నచ్చుతుంది". Sakshi. 2 October 2019. Archived from the original on 20 September 2020. Retrieved 8 December 2020.