ఏప్రిల్ 15
Jump to navigation
Jump to search
ఏప్రిల్ 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 105వ రోజు (లీపు సంవత్సరములో 106వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 260 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1925: గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లాను విడదీసి, 15 ఏప్రిల్ 1925 తేదిన, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లాగా పేరు మార్చుకొంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా ఏర్పడింది.విశాఖపట్నం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15 నాడు ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. చూడు: తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్సైటు
- 1925:బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది) . తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.[1] చూడు: పశ్చిమ గోదావరి జిల్లా చూడు: మార్చి 1
- 2018: సీ పి యస్ విధానానికి నిరసనతెలుపుటకై తెలంగాణా ఉపాధ్యాయ, ఉద్యోగులు 103 సంఘాల వారు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కుటుంబాలతో జనజాతర కార్యక్రమాన్ని ఉవ్వెత్తున నిర్వహించారు.
జననాలు
[మార్చు]- 1452: లియొనార్డో డావిన్సి, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు.
- 1469: గురునానక్, భారత ఆధ్యాత్మిక గురువు, సిక్కుమత స్థాపకుడు (మ. 1539)
- 1707: లియొనార్డ్ ఆయిలర్, స్విష్ గణిత శాస్త్రవేత్త. (మ. 1783)
- 1806: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (మ.1878)
- 1913: కరీముల్లా షా, ముస్లిం సూఫీ, పండితుడు. (జ. 1838)
- 1932: సుదర్శన్ భట్, మరాఠీ కవి (మ. 2003)
- 1977: సుదర్శన్ పట్నాయక్, భారత సైకత శిల్పి.
- 1992: వందన కటారియా, భారతీయ హాకీ క్రీడాకారిణి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
మరణాలు
[మార్చు]- 1845: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)
- 1865 : అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (జ.1809)
- 1961: రాచాబత్తుని సూర్యనారాయణ, సాతంత్ర్యసమయోధుడు. (జ.1903)
- 1965: బండారు రామస్వామి, నాట్య కళాకారులు, బంధిఖానా, భక్త రామదాసు, కర్ణుని స్వామిభక్తి, దమయంతి మొదలైన ఏకపాత్రాభినయం రచనలను నిర్వహించారు.
- 2022: జీ.వి. శ్రీరామరెడ్డి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. (జ.1945)
- 2024: ఆర్. ఇంద్ర కుమారి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకురాలు. మాజీ మంత్రిణి. (జ.1950/51)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం.
- ప్రపంచ కళా దినోత్సవం
- సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం.
సూచికలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2011-08-15.
బయటి లింకులు
[మార్చు]ఏప్రిల్ 14 - ఏప్రిల్ 16 - మార్చి 15 - మే 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |