తేజస్వి మదివాడ
తేజస్వి మదివాడ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్య | బి.ఎ (మాస్ కమ్యూనికేషన్) |
వృత్తి | సినిమా నటి, ప్రచారకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
ఎత్తు | 5 అడుగుల 4 అంగుళాలు |
తేజస్వి మదివాడ తెలుగు సినిమా నటి, ప్రచారకర్త. తమిళ చిత్రంలో కూడా నటించింది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది.[1] ఆమె 2024లో రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ షోలో పాల్గొన్నది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]తేజస్వి 1991, జూలై 3న హైదరాబాద్ లో జన్మించింది. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది.[2]
తొలి జీవితం
[మార్చు]చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకున్న తేజస్వి క్రమంగా పాశ్చాత్య నృత్యరీతులపైనా దృష్టిపెట్టింది. హెచ్.ఎస్.బీ.సీ., మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్లో డాన్స్ తరగతులు నిర్వహించింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసింది. మొదటగా అల్లు అర్జున్ తో కలిసి 7అప్ ప్రకటనకు పనిచేసింది. తరవాత డాబర్ గులాబరీ నిర్వహించిన పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. మిస్ హైదరాబాద్ గా ఎంపికయింది.
సినీరంగ ప్రవేశం
[మార్చు]డ్యాన్స్ తరగతులు తీసుకుంటూనే మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసిన తేజస్వి హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోని ఎం.ఎ. లో చేరింది. అదే సమయంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలయ్యాక వరుసగా అవకాశాలు వచ్చాయి.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2012 | లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | అతిధి పాత్ర | తెలుగు | |
2013 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | గీత చెల్లి | తెలుగు | |
2014 | మనం | దివ్య | తెలుగు | |
2014 | హార్ట్ అటాక్ | శ్రీయ | తెలుగు | |
2014 | ఐస్ క్రీం | రేణు | తెలుగు | |
2014 | లవర్స్ | గీతా | తెలుగు | |
2014 | అనుక్షణం | సత్య | తెలుగు | |
2015 | మళ్ళీ మళ్ళీ రాని రోజు | మోహెక్ | తెలుగు | |
2015 | పండగ చేస్కో | స్వాతి | తెలుగు | |
2015 | కేరింత[3] | ప్రియా | తెలుగు | |
2015 | సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ | సీత చెల్లెలు | తెలుగు | |
2015 | శ్రీమంతుడు | వెంకటరత్నం కూతురు | తెలుగు | |
2015 | జతకలిసే | తెలుగు | ||
2016 | నట్పదిగారం 79 | పూజ | తమిళం | |
2016 | సూపర్ స్టార్ కిడ్నాప్ | అతిథి పాత్ర | తెలుగు | |
2016 | ఊర్వశివో రాక్షసివో | తెలుగు | ||
2016 | విష్ యూ హ్యాపీ బ్రేకప్ | నిక్కి | తెలుగు | |
2016 | రోజులు మారాయి | రంభా | తెలుగు | |
2016 | నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ | పద్దు స్నేహితురాలు | తెలుగు | |
2017 | మిస్టర్ | తెలుగు | ||
2017 | బాబు బాగా బిజి | పారు మినన్ | తెలుగు | |
2017 | మన ముగ్గురి లవ్‌స్టోరి | స్వాతి | తెలుగు | వెబ్ సిరీస్ |
2021 | కమిట్‌మెంట్ | తెలుగు | ||
2024 | హైడ్ న్ సిక్ | తెలుగు |
వెబ్‌సిరీస్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "మంచి ఐడియాతో తీస్తే... 'ఐస్‌క్రీమ్'లా ఆర్థిక లాభాలు!". Sakshi. Retrieved 1 May 2017.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి. "కథాపరంగానే అలా నటించా.. దానిలో తప్పేముంది : తేజస్వి". Archived from the original on 29 ఏప్రిల్ 2017. Retrieved 1 May 2017.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Kerintha: Coming-of-age stories".