తేజ్‌పూర్
తేజ్‌పూర్ | |||||
---|---|---|---|---|---|
పట్టణం | |||||
అగ్నిగర్ కొండ (పైన) మహాభైరవ్ గుడి (మధ్యన) హరిహర యుద్ధం (దిగువ) | |||||
Coordinates: 26°38′N 92°48′E / 26.63°N 92.8°E | |||||
దేశం | భారతదేశం | ||||
రాష్ట్రం | అసోం | ||||
Government | |||||
• Type | పురపాలక సంస్థ | ||||
• Body | తేజ్‌పూర్ పురపాలక సంస్థ | ||||
విస్తీర్ణం | |||||
• Total | 40 కి.మీ2 (20 చ. మై) | ||||
Elevation | 48 మీ (157 అ.) | ||||
జనాభా (2011)[1] | |||||
• Total | 1,02,505 | ||||
• Rank | 8వ | ||||
• జనసాంద్రత | 2,600/కి.మీ2 (6,600/చ. మై.) | ||||
భాషలు | |||||
• అధికారిక | అస్సామీ | ||||
Time zone | UTC+5:30 (భారత కాలమానం) | ||||
పిన్ కోడ్ | 784001 | ||||
ISO 3166 code | IN-AS | ||||
Vehicle registration | ఏఎస్-12 |
తేజ్‌పూర్, అసోం రాష్ట్రంలోని సోనిత్‌పూర్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం. బ్రహ్మపుత్రా నదికి ఒడ్డున ఉన్న ఈ పట్టణం గువహాటికి ఈశాన్య వైపుగా ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర తీర పట్టణాల్లో ఇది అతిపెద్ద పట్టణం.[2]
భౌగోళికం
[మార్చు]26°38′N 92°48′E / 26.63°N 92.8°E అక్షాంశరేఖాంశాల మధ్య ఈ పట్టణం ఉంది.
వాతావరణం
[మార్చు]వేసవిలో ఈ పట్టణ సగటు ఉష్ణోగ్రత 36 సెంటిగ్రెడ్ (97 ఫారన్ హీట్) ఉండగా, శీతాకాలంలో 13 సెంటిగ్రెడ్ (55 ఫారన్ హీట్) సగటు ఉష్ణోగ్రత ఉంటుంది.[3]
విస్తీర్ణం
[మార్చు]40 కి.మీ. (20 చ.మై) ల విస్తీర్ణంలో ఉన్న ఈ పట్టణం సముద్రమట్టం నుండి ఎత్తు 48 మీ. (157 అ.) ఎత్తులో ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 1,02,505 జనాభా ఉండగా 2,600/కి.మీ2 (6,600/చ. మై.) జన సాంద్రత ఉంది. ఈ జనాభాలో 52,313 మంది పురుషులు.. 50,192 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ 83,562 (90.17%) మంది అక్షరాస్యులు ఉండగా అందులో 43,783 (92.60%) మంది పురుషులు.. 39,779 (87.64%) మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ జనాభాలో 9,835 మంది (బాలురు 5,032 - బాలికలు 4,803) ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. పురుష స్త్రీ నిష్పత్తి 1000:959 ఉండగా, బాల బాలికల నిష్పత్తి 1000:954 గా ఉంది.
ప్రభుత్వ రంగం
[మార్చు]తేజ్‌పూర్ పట్టణం తేజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[4]
పర్యాటక ప్రాంతాలు
[మార్చు]- నామెరి జాతీయ పార్కు
- అగ్నిగర్
- బాముని కొండలు
- బురా-చపోరి వన్యప్రాణుల అభయారణ్యం
- చిత్రలేఖ ఉద్యానవనం
- డా-పర్బాటియా
- జిల్లా మ్యూజియం
- ఓగురి కొండ
- పాడుం పుఖూరి
- కలికా భోమోర వంతెన
- నాగ్ - శంకర్ ఆలయం
- కేతకేశ్వర్ దేవాల్
చిత్రమాలిక
[మార్చు]-
చౌక్ మార్కెట్, తేజ్‌పూర్
-
బ్రహ్మపుత్ర నది
-
చర్చి
-
జిల్లా గ్రంథాలయం
-
చిత్రలేఖ ఉద్యానవనంలోని సరస్సు
-
ప్రభుత్వ బాలుర పాఠశాల
-
తేజ్‌పూర్ కళాశాల
-
తేజ్‌పూర్ రైల్వే స్టేషన్
మూలాలు
[మార్చు]- ↑ https://www.census2011.co.in/census/metropolitan/183-tezpur.html
- ↑ "Tezpur Metropolitan Urban Region Population 2011 Census". www.census2011.co.in. Retrieved 2020-11-24.
- ↑ "Tezpur, India Weather Averages - Monthly Average High and Low Temperature - Average Precipitation and Rainfall days - World Weather Online". Retrieved 2020-11-24.
- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2020-11-24.
ఇతర లంకెలు
[మార్చు]- సోనిత్‌పూర్ జిల్లా Archived 2020-12-01 at the Wayback Machine