ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ (1903 సినిమా)
Jump to navigation
Jump to search
ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ | |
---|---|
దర్శకత్వం | ఎడ్విన్ ఎస్. పోర్టర్ |
స్క్రీన్ ప్లే | ఎడ్విన్ ఎస్. పోర్టర్ |
నిర్మాత | ఎడ్విన్ ఎస్. పోర్టర్ |
తారాగణం | ఆల్ఫ్రెడ్ సి. అబాడీ, బ్రోనోచా బిల్లీ ఆండర్సన్, జస్సస్ డి. బర్న్స్ |
ఛాయాగ్రహణం | జాకబ్ బ్లెయిర్ స్మిత్, ఎడ్విన్ ఎస్. పోర్టర్ |
కూర్పు | ఎడ్విన్ ఎస్. పోర్టర్ |
పంపిణీదార్లు | వార్నర్ బ్రదర్స్ (ఎడిసన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ), క్లీన్ ఆప్టికల్ కంపెనీ |
విడుదల తేదీ | డిసెంబరు 1, 1903 |
సినిమా నిడివి | 12 నిముషాలు (18 ఫ్రేమ్స్/సెకన్) |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | మూకీ చిత్రం |
బడ్జెట్ | $150[1] |
ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ 1903, డిసెంబర్ 1న విడుదలైన అమెరికా మూకీ లఘుచిత్రం. ఎడ్విన్ ఎస్. పోర్టర్ దర్శకత్వంలో ఆల్ఫ్రెడ్ సి. అబాడీ, బ్రోనోచా బిల్లీ ఆండర్సన్, జస్సస్ డి. బర్న్స్ తదితరులు నటించిన ఈ చిత్రం న్యూజెర్సీలోని మిల్టౌన్ లో చిత్రీకరించబడింది. 1896లో స్కాట్ మార్బుల్ రాసిన ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ అనే నాటకం, 1900లో బుచ్ కాస్సిడీ ఆధ్వర్యంలో జరిగిన రైలు దోపిడీ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[2][3]
కథ
[మార్చు]నీళ్ళకోసం ఆగిన రైలులోకి నలుగురు బందిపోట్లు చొరబడి, అందులోని ఒక ఉద్యోగిని చంపి ప్రయాణికుల వద్దనున్న సొమ్మును దోచుకొని గుర్రాలపై పారిపోతారు. అడవితో ఒకచోట చేరి సొమ్మను పంచుకుంటున్న సమయంలో టెలిఫోన్ ఆపరేటర్ కుమార్తె, మరికొంతమంది వచ్చి ఆ బందిపోట్లను చంపేస్తారు.
నటవర్గం
[మార్చు]- అల్ఫ్రెడ్ సి. అబాడి
- బ్రోనో బిల్ బిల్ ఆండర్సన్
- జ్యూస్ డి. బర్న్స్
- వాల్టర్ కామెరాన్
- డోనాల్డ్ గల్లాహెర్
- ఫ్రాంక్ హన్వే
- ఆడమ్ చార్లెస్ హేమన్
- టామ్ లండన్
- జాన్ మనుస్ డౌగెర్టీ, సీనియర్
- రాబర్ట్ మిలాస్చ్
- మేరీ ముర్రే
- మేరీ మంచు
- జార్జ్ బర్న్స్
- మోర్గాన్ జోన్స్
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఎడ్విన్ ఎస్. పోర్టర్
- ఆధారం: స్కాట్ మార్బుల్ రాసిన "ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ"
- ఛాయాగ్రహణం: జాకబ్ బ్లెయిర్ స్మిత్, ఎడ్విన్ ఎస్. పోర్టర్
- కూర్పు: ఎడ్విన్ ఎస్. పోర్టర్
- పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్ (ఎడిసన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ), క్లీన్ ఆప్టికల్ కంపెనీ
చిత్ర విశేషాలు
[మార్చు]- వేరు వేరు రకాల షాట్స్ తో ఉన్న సినిమాకంటే ఒకే కథను వివిధ షాట్స్ తో చెప్పిన సినిమాకు ఎక్కువ ఆదరణ ఉంటుందని గ్రహించిన తొలి దర్శకుడు ఎడ్విన్ ఎస్. పోర్టర్.[4]
- ఒకే సన్నివేశంతో కూడిన చిత్రాలతో విసుగుచెందిన ప్రేక్షకులు థియేటర్ రావడం మానేసిన సమయంలో ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులను మళ్ళీ థియేటర్ కు రప్పించింది.[5]
- న్యూయార్క్ కు కొన్ని మైళ్ళదూరంలో ఉన్న పాటర్ సన్ సమీపంలో అవుట్ డోర్ లో ఈ చిత్రం తీయబడింది.[5]
- చలనచిత్రరంగంలో మొదటి స్టార్ గా గుర్తింపుపొందిన యాండర్ సన్ అనే నటుడు ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ చిత్రం విడుదలైన తరువాత వారానికి ఒక సినిమా చొప్పున ఏడెళ్ళపాటు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.[5]
- చలనచిత్రరంగంలో ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ సినిమాతో కథాచిత్రాల యుగం ప్రారంభమై, స్క్రీన్ ప్లే పరంగా తరువాతికాలంలో వచ్చిన అనేక సినిమాలకు ఆధారమయింది.[6]
- ట్రిక్ షాట్స్, ఫేడౌట్స్, పారలెల్ రిలేషన్ షాట్స్, ఇంటర్ కట్స్, ప్రాపర్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మొదలైనవన్ని ఈ చిత్రంతోనే ప్రారంభమయ్యాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ Souter, Gerry (2012). American Shooter: A Personal History of Gun Culture in the United States. Potomac Books, Inc. p. 254. ISBN 1-597-97690-3.
- ↑ p.39 Mayer, David Stagestruck Filmmaker: D. W. Griffith and the American Theatre University of Iowa Press 1 Mar 2009
- ↑ Kramer, Fritzi (3 November 2013). "The Great Train Robbery (1903) A Silent Film Review". moviessilently.com/. Retrieved 5 February 2019.
they blow up the safe (with a pink and orange hand-colored explosion)
- ↑ పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 5.
- ↑ 5.0 5.1 5.2 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 6.
- ↑ 6.0 6.1 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 7.
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో The Great Train Robberyకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
ఆధార గ్రంథాలు
[మార్చు]- పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 5 February 2019[permanent dead link]