నటాషా భరద్వాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నటాషా భరద్వాజ్
2024లో భరద్వాజ్
జననం (1997-09-17) 1997 సెప్టెంబరు 17 (వయసు 27)
విద్యాసంస్థజై హింద్ కళాశాల, ముంబై
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
బిరుదుమిస్ దివా 2016 (ఫైనలిస్ట్)
మిస్ దివా 2016 (మిస్ టాలెంటెడ్)
తల్లిదండ్రులుభరద్వాజ్, రచన

నటాషా భరద్వాజ్ (జననం 1997 సెప్టెంబరు 17 ) భారతీయ సినిమా నటి, ఆమె ప్రధానంగా హిందీ వెబ్ సీరీస్ లలో నటిస్తుంది. ఆమె తన కెరీర్‌ను ఇండియాస్ నెక్స్ట్ సూపర్‌స్టార్స్ (2018) అనే రియాలిటీ షోలో పోటీదారుగా ప్రారంభించింది, అక్కడ ఆమె విజేతగా నిలిచింది. ఆమె ఆ తర్వాత పవన్ అండ్ పూజ (2020) అనే వెబ్ సిరీస్‌తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇది ఎంటీవిలో ప్రసారం కాగా దీప్తి నావల్, మహేష్ మంజ్రేకర్ లాంటి నటులతో ఆమె కలిసి పనిచేసింది.

ముంబై డైరీస్ 26/11 (2021) సిరీస్‌లో ఆమె పాత్రకు బాగా పేరు తెచ్చుకుంది.[1] ఇందులో, డాక్టర్ దియా పరేఖ్‌గా ఆమె నటించగా పలు ప్రశంసలతో పాటుగా ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును పొందింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

నటాషా భరద్వాజ్ 1997 సెప్టెంబరు 17న ముంబైలో పుట్టి పెరిగింది. ఆమె ముంబైలోని జై హింద్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చిన్నప్పుటి నుంచి మోడలింగ్‌ మీద ఆసక్తితో ఉన్న ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో షోలల్లో తన ఫెర్మామెన్స్‌తో చక్కని మోడల్ గా నిరూపించుకుంది.

కెరీర్

[మార్చు]

ఆమె మిస్ దివా 2016లో పాల్గొంది, అక్కడ ఆమె ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది. "యమహా ఫాసినో మిస్ టాలెంటెడ్" టైటిల్‌ను గెలుచుకుంది.[2][3] మిస్ దివా 4వ ఎడిషన్ 2016లో జరిగింది. 16 మంది పోటీదారులు పోటీలో పాల్గొన్నారు. మిస్ దివా 2016 టెలివిజన్ రియాలిటీ సిరీస్‌ కలర్స్ ఇన్ఫినిటీలో ప్రసారం చేయబడింది.

2021లో మొదలైన టెలివిజన్ సిరీస్ ముంబై డైరీస్ 26/11 హిందీ భాషా మెడికల్ డ్రామా. 2008 నవంబరు 26న ముంబై దాడుల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర వైద్యం, సంక్షోభ సమయాల్లో వైద్య సిబ్బంది, వాళ్లు ఎదుర్కొనే సవాళ్లపై కథ నడుస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2021 సెప్టెంబరు 9న విడుదలైంది. ఈ ధారావాహికను నిఖిల్ గోన్సాల్వేస్‌తో కలిసి నిక్కిల్ అద్వానీ రూపొందించాడు.

నగరంలో ఎన్నడూ లేనివిధంగా వరద ముంచెత్తడంతో మరోసారి ప్రభుత్వాసుపత్రి వేలాదిగా జనాలను రక్షించే వేదిక అయింది. 2005 జూలై 26 నాటి వరదల కారణంగా మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల మందికి పైగా మరణించగా, బాధితుల్లో ఎక్కువ మంది ముంబై నగరం నుండే ఉన్నారు. ఇదే కథాంశంతో ముంబై డైరీస్ సీజన్ 2 రూపొందింది. 2023లో, ముంబై డైరీస్ సీజన్ 2 మొదలైంది, నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ముంబై డైరీస్ సీజన్ 2లో డాక్టర్ దియా పరేఖ్ పాత్రను తిరిగి నటాషా భరద్వాజ్ పోషించింది.

అయితే, ఆ పాత్ర సీజన్ 1లో ఎలా ఉందో దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. సీజన్ 2లో, ఆమె డిప్రెషన్‌తో ఉంటుంది. ఆమె థెరపీకి వెళుతుంది. తన తల్లిని కోల్పోవడంతో, తండ్రితో తన సంబంధాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాత్రలో ఒదిగిపోయిన నటాషా భరద్వాజ్ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

ఇష్క్ నెక్స్ట్ డోర్ అనే జియో స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన భారతీయ హిందీ భాషా రొమాంటిక్ డ్రామా టెలివిజన్ సిరీస్, జియోసినిమాలో 2023 జూలై 3న ప్రీమియర్ చేయబడింది. ఈ ధారావాహికలో అభయ్ మహాజన్, మృణాల్ దత్ లతో కలిసి నటాషా భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించింది. ఇది ట్రయాంగిల్​ లవ్​ కథ చాలా సాదాసీదాగా ఉన్నా కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. లవ్‌ ట్రాక్​ చాలా బాగుంటుందని సమీక్షలు వచ్చాయి.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్ మూలాలు
2018 ఇండియాస్ నెక్స్ట్ సూపర్‌స్టార్స్ పోటీదారు విజేత [4]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్ మూలాలు
2020 పవన్ & పూజ పూజా మహేశ్వరి [5]
2021–ప్రస్తుతం ముంబై డైరీస్ 26/11 డాక్టర్ దియా పరేఖ్ [6]
2023 ఇష్క్ నెక్స్ట్ డోర్ మెహర్ కౌర్ సిక్కా [7]

మ్యూజిక్ వీడియోస్

[మార్చు]
సంవత్సరం టైటిల్ సింగర్ మూలాలు
2022 మాన్ మేరీ జాన్ కింగ్ [8]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం పురస్కారం కేటగిరీ షో/సినిమా

ఫలితం

మూలాలు
2022 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి - డ్రామా (ఒటిటి) ముంబై డైరీస్ 26/11 విజేత [9]

మూలాలు

[మార్చు]
  1. Rediff Style (30 May 2023). "Why The Internet Loves Natasha Bharadwaj". Rediff.com. Retrieved 29 June 2023.
  2. "2016 - Miss Diva Contestants - Miss Diva - Beauty Pageants". Femina Miss India. Retrieved 25 August 2017.
  3. "Ishq Next Door actress Natasha Bharadwaj: When it comes to love, I am an old-school romantic". Telegraph India. Retrieved 14 July 2023.
  4. "Aman Gandotra, Natasha Bharadwaj and Shruti Sharma were declared winners of India's Next Superstars". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-04-07. Retrieved 2018-04-08.
  5. "Pawan & Pooja trailer: Deepti Naval, Mahesh Manjrekar, Gul Panag, Sharman Joshi explore changing definitions of love". Firstpost. 2020-02-05. Retrieved 2021-06-18.
  6. "Nikkhil Advani on 'Mumbai Diaries 26/11' success: Overwhelming to see everyone's effort getting recognition". Mid Day (in ఇంగ్లీష్). 2021-09-14. Retrieved 2021-09-14.
  7. "Ishq Next Door Trailer: Abhay Mahajan, Natasha Bharadwaj, Mrinal Dutt, Purav Jha starrer series". Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 June 2023.
  8. "WATCH - Trending music video 'Maan Meri Jaan' sung by King, starring Natasha Bharadwaj". Times of India. Retrieved 25 October 2022.
  9. "List of awards and nominations received by Natasha Bharadwaj". Times of India. Retrieved 29 December 2022.