భువనంద దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Bhubhananda Das.jpg
భువనంద దాస్

భువనంద దాస్ ఒరిస్సాకు చెందిన భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు. అతను కేంద్ర విధానసభ, భారత రాజ్యాంగ పరిషత్, రాజ్యసభ, లోక్ సభలలో సభ్యుడుగా వ్యవహరించాడు.[1][2]

పరిచయం

[మార్చు]

దాస్ ఒక గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఇంజనీర్, అలుపెరగని సామాజిక కార్యకర్త. అతను భారతదేశ సాంస్కృతిక వారసత్వం పట్ల విశిష్ట గౌరవాన్ని కలిగి ఉన్నాడు. ఆనాటి సామాజిక, ఆర్థిక అభ్యున్నతి, రాజకీయ ఆలోచనలతో అన్ని విషయాలపై ప్రగతిశీల అభిప్రాయాలను కలిగి ఉన్నాడు. అతను సుదీర్ఘకాలం శాసనసభ సభ్యుడిగా వ్యవహరించినందుకు, "ఫాదర్ ఆఫ్ ది హౌస్" గా పిలువబడ్డాడు.[3]

ఉద్యమం

[మార్చు]

దాస్ 1931 లో కటక్‌లో జరిగిన మొదటి ఒరిస్సా రాష్ట్ర ప్రజల సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇది ప్రజా మండల ఉద్యమానికి నాంది పలికింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Sahoo, Arun Kumar (April 2011). "Nayagarh and Prajamandal Andolan" (PDF). Orissa Review. Archived from the original (PDF) on 2016-09-20.
  2. Rajya Sabha
  3. http://rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/d.pdf
  4. "Members Bioprofile". Archived from the original on 28 July 2014. Retrieved 23 July 2014.