సముద్ర గుర్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సముద్ర గుర్రం
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Hippocampus

సముద్ర గుర్రం గుర్రాన్ని తలపించే చిన్న చేప.

సముద్రపు గుర్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, సమశీతోష్ణ జలాల్లో కనిపిస్తాయి. వీటికి వంకర మెడలు పొడవైన గొంతు తల, శరీరం నిటారుగా ఉండి తోక మాత్రం వంకరగా ఉంటుంది. ఈ జంతువులకు నోట్లో పళ్ళుండవు. పగడపు దిబ్బలు లేదా మడ అడవుల వంటి ప్రాంతాలలో నివసిస్తాయి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వరకు పసిఫిక్‌ జలాల్లో నాలుగు జాతులు కనిపిస్తాయి. దాని ప్రధానమైన ఆహారం కోప్‌పాడ్‌ అని పిలువబడే రొయ్యలు, పీతల కుటుంబానికి చెందిన సూక్ష్మప్రమాణం గల రొయ్యలు. ఇవి అంత సులభంగా చిక్కవు. మరి నిట్టనిలువుగా నిలిచి ఈదే ఈ చేప. తను వెంటాడే ఎరలో 90 శాతాన్ని ఎలా పట్టుకోగలుగుతుంది? ఈ నైపుణ్యం అంతా ఈ చేపతలలోనే ఉంటుందని, సముద్ర జీవశాస్త్రవేత్త బ్రాడ్‌జెమ్మెల్‌ అభిప్రాయం.

ఈ చేప అత్యంత వేగవంతంగా 3 డి దృశ్యాన్ని చూపే సామర్థ్యం గల దృష్టిని కలిగి ఉండటమే ఇందుకు కారణం. ఈ సీహార్స్‌ ముక్కుభాగం నీటిలో ఎక్కువ అలజడిని కలిగించకుండా తన ఎరను వేటాడటానికి దగ్గరకు చేరుకొనేలా చేస్తుందని అతడు కనుగొన్నాడు. ఇంకా ముఖ్యమైన విషయం, దాని ఎర అయిన కోప్‌పాడ్‌లు దృష్టిలేనివి. అవి ప్రవాహపు మార్పులను అనుసరించి లభించే సంకేతంతో తప్పించుకుపోతూ ఉంటాయి. ఈ సముద్రపు గుర్రాలను చూసి చాలా నెమ్మదైనవి. సహనం గలవి అనుకుంటారు. కాని అవి సముద్రంలో అత్యంత వేగంగా తప్పించుకుపోయే జీవులలో ఒకటైన జాతి పైనే తమ ఆహారం కోసం పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నాయి అంటే, అవి చాలా సామర్థ్యం గల వేటాడే చేపలని తెలుస్తుంది. మగ సముద్రపు గుర్రాలు తమ శరీరం ముందు భాగంలో సంతానాన్ని పొదగటానికి అనువైన ఒక సంచివంటి అరను కలిగి ఉంటాయి. జతకట్టిన సమయంలో ఆడచేప గుడ్లను ఈ మగచేప సంచిలోనికి విడుస్తుంది. అపుడు మగచేప వాటిని అంతర్గతంగా ఫలదీకరణం చేసి, పిల్లలు గుడ్లలో నుండి బయటకు వచ్చేక, వాటిని నీటిలోకి విడుదల చేస్తుంది.

ఈ సముద్ర గుర్రపు చేపలు, తమ శరీర ఆకారాన్ని అనుసరించి అంతగా ఈదగల నైపుణ్యం గలవి కావు. తుఫాను వాతావరణంతో కూడిన సముద్రంలో తేలికగా మృత్యువాత పడతాయి ఇవి. ఈ చేపల వీపుపై గల రెక్క సహాయంతో కావలసిన దిక్కుకు తిరుగుతాయి. ఈ ఫిన్‌ (రెక్క) సెకనుకు 35 సార్లు కొట్టుకుంటుంది. పక్షిరెక్కల్లా. తల వెనుక భాగంలో గల చిన్న ఫిన్‌లను కూడా మలుపు తిరగటం కోసం ఉపయోగించుకుంటుంది ఈ చేప. ఇవి తమ పట్టుకొనే శక్తి గల తోకలతో సముద్రపు గడ్డిమొక్కలను, పగడపు దిబ్బలవంటి వాటిని పట్టుకొని ఒక స్థానంలో నిలువగలుగుతాయి. ఆ సమయంలో పక్కనుండి పోయే సూక్ష్మప్రాణులను నోటిలోనికి పీల్చటం కోసం, తమ పొడవైన ముక్కులను ఉపయోగిస్తాయి. వీటికి అధికంగా తినే గుణం ఉంటుంది గనుక, వరుసగా తింటూనే ఉంటాయి. సముద్రపు గుర్రాలుగా పిలువబడే ఈ చిన్న సముద్ర జీవుల తల భాగం గుర్రం తలను పోలి ఉండటంతో ఆ పేరు వచ్చింది.