1839
Jump to navigation
Jump to search
1839 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1836 1837 1838 - 1839 - 1840 1841 1842 |
దశాబ్దాలు: | 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 23: అమెరికాలో అత్యంత ప్రజాదరణ గల పత్రిక "ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్"లో "ఓకే" పదం మొదటిసారిగా ప్రచురితమైంది.
- జూలై 2: 53 మంది తిరుగుబాటు ఆఫ్రికన్ బానిసలు, జోసెఫ్ సిన్క్య్ నాయకత్వంలో, క్యూబా తీరానికి 20 మైళ్ళ దూరంలో, బానిసలతో ప్రయాణిస్తున్న నౌక 'అమిస్తాడ్' ని స్వాధీనం చేసుకున్నారు.
- ఆగష్టు 19: ఫ్రెంచి ప్రభుత్వం లూయిస్ డగుర్రె అభివృద్ధి చేసిన ఫోటోగ్రఫీ విధానపు పేటెంట్లను కొనుగోలు చేసి ఈ ఆవిష్కరణను "ప్రపంచానికి ఉచిత" బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది.
- నవంబర్ 25: దేశంలోని తీరప్రాంతాలను ప్రచండ తుఫాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడులక్షల మంది మరణించి ఉంటారని అంచనా.
తేదీవివరాలు తెలియనివి
[మార్చు]- రాబర్ట్ కార్నెలియస్ - మొట్టమొదటి స్వీయచిత్రం (సెల్ఫీ) తీశాడు.
- హెన్రీ విక్టర్ రేగ్నాల్ట్ - ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త మొదటిసారిగా కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను ఉత్పత్తి చేసాడు.
- థియోడార్ ష్వాన్, మథయాస్ జాకబ్ ష్లీడెన్ మొక్కలు, జంతువులన్నీ కణాలతో నిర్మించడ్డాయని గుర్తించారు.
- ఐజాక్ మెరిట్ సింగర్ రాళ్ళను డ్రిల్లింగ్ చేసే యంత్రాన్ని కనిపెట్టి దానిపై పేటెంటును పొందాడు.
- ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్రము తొలిసారిగా ముద్రించబడింది.
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 11: జె.విలియర్డ్ గిబ్స్ - అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రజ్ఞుడు (మ.1903)
- మార్చి 3: జంషెడ్జీ టాటా - టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. (మ.1904)
- జూలై 20: జూలియస్ ఫ్రెడ్రిచ్ కాన్హీం - జర్మన్ పాథాలజిస్టు (మ.1884)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 26: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (జ.1763)
- మే 21: జొహాన్ ఫ్రెడెరిక్ గట్స్మత్స్ - ఆధునిక జిమ్నాస్టిక్స్ పితామహుడు (జ.1759)
- జూన్ 17: విలియం బెంటింక్ - బ్రిటిష్ ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్. (జ.1774)
- జూన్ 27 : మహారాజా రంజిత్ సింగ్ - సిక్ఖు సామ్రాజ్యం స్థాపకుడు. (జ.1780)
- జూలై 1 : మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు.(జ.1785)
- అక్టోబర్ 1: వెన్నెలకంటి సుబ్బారావు - ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర వ్రాసిన తెలుగువాడు. (జ.1784)