(Translated by https://www.hiragana.jp/)
drive - విక్షనరీ Jump to content

drive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)

    క్రియ, నామవాచకం, కొట్టుకొనిపోవుట, పోవుట.

    • he drove homeబండిమీద యెక్కి తానే తోలుకొని యింటికి పోయినాడు.
    • the ship drove ashore ఆ వాడ దరి తట్టింది.
    • we let the ship drive ఆ వాడను గాలి పోయిన దోవను విడిచినాము.
    • the wind was driving along గాలి వడిగా కొట్టుతూ వుండినది.
    • a driving rain గాలి తేచ్చే వాన.
    • what are you driving at నీ అభిప్రాయ మేమి, నీ భావమేమి.

    క్రియ, విశేషణం, తోలుట, నడిపించుట, గడుపుట.

    • he drove a nail into the wall ఆ గోడలో చీలను కొట్టినాడు.
    • the explosion of the powder drove the bricks into my house తుపాకిమందుభగ్గున అంటుకొన్నందున ఆ యిటిక రాళ్లు మా యింటిలో చెదిరిపడ్డవి.
    • he drove a bargain with me వాడు నాతో బేరమాడినాడు.
    • he drives a good trade మంచి వర్తకము చేస్తాడు.
    • they drove or forced him to dismount వాణ్ని గుర్రము విడిచి దిగమని నిర్భందించినారు.
    • to drive asunder వీడకొట్టుట, చీలేటట్టు కొట్టుట.
    • he drove them away వాండ్లను అవతలికి తరిమినాడు.
    • the wind drove it away అది గాలికి కొట్టుక పోయినది.
    • he drove them back వాండ్లను వేనక్కు తరిమినాడు.
    • the rain drove me into the house వానకుఆ యింట్లో చొరబడ్డాను.
    • this drove him into debt యిందుచేత వాడుఅప్పులపాలైనాడు.
    • this drove them mad యిందుచేత వాండ్లు పిచ్చిపడ్డారు,యిందుచేత వాండ్లు కలవరపడ్డారు, భ్రమపడ్డారు.
    • he drove the mob off ఆ గుంపును అవతలికి తోలినాడు.
    • they drove him out of the caste వాణ్ని కులములో వెలివేసినారు.
    • he drove the demon out వాడు దయ్యాన్ని తోలినాడు.
    • he drove his wife in a carriage వాడి పెండ్లామును బండిలో పెట్టి తీసుకొనిపోయినాడు.
    • I will drive you thereనిన్ను అక్కడికి నా బండిలో కూర్చుండబెట్టుకొనిపోతాను.
    • the smoke drove the mosketoes out పొగకు దోమలు పోయనవి.
    • this drove the business out my thoughts యిందుచేత నాకు ఆ సంగతి మరిచిపోయినది.
    • this drove him out of his senses యిందుచేతవాడికి వకటి తోచకపోయినది.
    • he drove through the town బండిమీద యెక్కి పట్టణము చుట్టినాడు.
    • he drove his spear thro my arm వాడు బల్లెముతో నా చెయ్యి తూటుపొబోడిచినాడు.
    • this drove me to tell him I could not go యిందుచేత నేను పోలేనని అతనితో చెప్పవలసివచ్చింది.
    • poverty drove him to sell his house వాడి దరిద్రమనేది యిల్లుకూడ అమ్ముకోవలసి వచ్చినది.

    నామవాచకం, s, an excursion for pleasure in a cariage బండియెక్కి విహారముగా పోవడము, స్వారి.

    • a road మార్గము.
    • there is adrive through the forest ఆ యడవిలో వొక బండి బాట వున్నది.

    మూలాలు వనరులు

    [<small>మార్చు</small>]
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drive&oldid=929619" నుండి వెలికితీశారు