రాజీవ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30: పంక్తి 30:
== తొలినాటి జీవితం మరియు విద్య: ==
== తొలినాటి జీవితం మరియు విద్య: ==


* [[దస్త్రం:Indira Gandhi, Jawaharlal Nehru, Rajiv Gandhi and Sanjay Gandhi.jpg|thumb|తాత నెహ్రూ, తల్లి ఇందిరా, తమ్ముడు సంజయ్ తో రాజీవ్ గాంధీ]]1944 ఆగస్టు 20న న్యూఢిల్లీలో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డోన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నాడు.
* [[దస్త్రం:Indira Gandhi, Jawaharlal Nehru, Rajiv Gandhi and Sanjay Gandhi.jpg|thumb|తాత నెహ్రూ, తల్లి ఇందిరా, తమ్ముడు సంజయ్ తో రాజీవ్ గాంధీ|ఎడమ]]1944 ఆగస్టు 20న న్యూఢిల్లీలో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డోన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నాడు.
* అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యంత్ర ఇంజనీరింగ్ చదివాడు.
* అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యంత్ర ఇంజనీరింగ్ చదివాడు.
* 1968లో, సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రా జన్మించారు.
* 1968లో, సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రా జన్మించారు.

12:12, 24 మే 2024 నాటి కూర్పు

రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ


6వ భారత ప్రధానమంత్రి
1984-1989
పదవీ కాలం
1984-1989
ముందు ఇందిరా గాంధీ
తరువాత వి.పి.సింగ్
నియోజకవర్గం అమేథీ , ఉత్తర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం ఆగష్టు 20 , 1944
ముంబై , మహారాష్ట్ర
India భారత్
మరణం మే 21 , 1991
శ్రీపెరుంబుదూరు , తమిళనాడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి సోనియా గాంధీ
సంతానం ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ
నివాసం న్యూ ఢిల్లీ
మతం హిందూ
జులై,31, 2008నాటికి

రాజీవ్ గాంధీ, (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఖాన్ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఇతని వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.[1][2]

తొలినాటి జీవితం మరియు విద్య:

  • తాత నెహ్రూ, తల్లి ఇందిరా, తమ్ముడు సంజయ్ తో రాజీవ్ గాంధీ
    1944 ఆగస్టు 20న న్యూఢిల్లీలో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డోన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నాడు.
  • అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యంత్ర ఇంజనీరింగ్ చదివాడు.
  • 1968లో, సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రా జన్మించారు.

రాజకీయ జీవితం:

రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదు, అతను విమాన పైలట్‌గా పనిచేసేవారు. కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి శ్రీమతి ఇందిరా గాంధీకి మద్దతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. పిదప, 1983లో, అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 31 అక్టోబర్ 1984న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకులచే హత్యకు గురయ్యారు. అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. తదుపరి జనరల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగాడు. 1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు. అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది.  రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు (PCC) మరియు పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి మరియు ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు. మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ముగిసింది .

ప్రధానమంత్రిగా

రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. దేశంలో కంప్యూటరైజేషన్ మరియు టెలికమ్యూనికేషన్ విప్లవం యొక్క ఘనత అతనికే చెందుతుంది. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు, శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.

మరణం

1991 మే 21న, రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య బాంబు దాడిలో హత్యయ్యాడు.

వారసత్వం

భారతదేశ ఆధునిక చరిత్రలో రాజీవ్ గాంధీ ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆధునిక భారతాన్ని రూపొందించడంలో ఆయన పోషించిన పాత్ర గుర్తుంచుకోవడం జరుగుతుంది.

ఇవికూడా చూడండి


ఇంతకు ముందు ఉన్నవారు:
ఇందిరా గాంధీ
భారత ప్రధానమంత్రి
31/10/1984—2/12/1989
తరువాత వచ్చినవారు:
వి.పి.సింగ్

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (20 May 2015). "ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
  2. విశాలాంధ్ర, ప్రకాశం (21 May 2011). "ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలిఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.

వెలుపలి లంకెలు