ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
సేవా అవలోకనం | |
స్థాపన | 1858 ఐఎఎస్ 26 జనవరి 1950 |
---|---|
దేశం | భారతదేశం |
స్టాఫ్ కాలేజీ | లాల్ బహాదుర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీ, ఉత్తరాఖండ్ |
కేడర్ కంట్రోలింగ్ అథారిటీ | డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ |
భాద్యతగల మంత్రి | నరేంద్రమోదీ, భారత ప్రధాన మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ |
చట్టపరమైన వ్యక్తిత్వం | ప్రభుత్వ; పౌర సేవ |
విధులు | |
క్యాడర్ సంఖ్య | 4,926 [1] |
ఎంపిక | సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఇండియా) |
అసోసియేషన్ | ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్, న్యూఢిల్లీ. |
పౌర సేవల అధిపతి | |
భారత కేబినెట్ కార్యదర్శి | రాజీవ్ గౌబా , ఐఎఎస్ |
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అనగా భారత ప్రభుత్వ ప్రీమియర్ పరిపాలనా పౌర సేవ. ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, పబ్లిక్ రంగ సంస్థలలో పట్టున్న, వ్యూహాత్మక స్థానాలున్నవారు. ఈ అధికారులు ప్రభుత్వ విధానాలను అమలు పరచి పర్యవేక్షిస్తారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సమాజంలో పేరు ప్రఖ్యాతలున్న గొప్ప సేవగా గుర్తింపు పొందింది. ఈ సేవ ద్వారా ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతారు, అమలు పరచగలుగుతారు. ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ జిల్లా, రాష్ట్రం, దేశం, మూడు స్థాయిల్లోనూ పనిచేయగలిగిన ఏకైక సర్వీసు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికైనవారు మొదట అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పదోన్నతుల ద్వారా వరుసగా పై హోదాలకు చేరుకుంటారు.[2]
చరిత్ర
[మార్చు]ఈస్టిండియా కంపెనీ కాలంలో, సివిల్ సర్వీసులు మూడుగా అవి ఒడంబడిక, అసమ్మతి, ప్రత్యేక పౌరసేవలుగా వర్గీకరించబడ్డాయి.
ఒడంబడిక పౌర సేవ,
[మార్చు]ఒడంబడిక పౌర సేవ, లేదా గౌరవనీయమైన ఈస్ట్ ఇండియా కంపెనీ సివిల్ సర్వీస్ (HEICCS) అని పిలవబడేది, వీటిలో ప్రభుత్వంలోని సీనియర్ పోస్టులను ఆక్రమించే పౌర సేవకులు ఎక్కువగా ఉంటారు. [3][4][5] పరిపాలన దిగువ స్థాయికి భారతీయుల ప్రవేశాన్ని సులభతరం చేయడానికి మాత్రమే అననుకూల పౌరసేవ ప్రవేశపెట్టబడింది.
అసమ్మతి పౌర సేవ
[మార్చు]ప్రత్యేక సేవలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇంపీరియల్ పోలీస్, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ వంటి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి, దీని ర్యాంకులు ఒడంబడిక పౌర సేవ లేదా భారతీయ సైన్యం నుండి తీసుకోబడ్డాయి.ఇంపీరియల్ పోలీస్ అనేక మంది భారతీయ ఆర్మీ అధికారులను దాని సభ్యులలో చేర్చింది, అయితే 1893 తర్వాత వార్షిక పరీక్ష దాని అధికారులను ఎంపిక చేయడానికి ఉపయోగించబడింది.[6][7]
ప్రత్వేక పౌరసేవ
[మార్చు]1858 లో HEICCS స్థానంలో ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) వచ్చింది,ఇది 1858 నుండి 1947 మధ్య భారతదేశంలో అత్యధిక పౌరసేవగా మారింది.
ఐసిఎస్ చివరి నియామకాలు
[మార్చు]ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) కి చివరి నియామకాలు 1942 లో జరిగాయి.[8][9]
ఉదాహరణలు
[మార్చు]- అసిస్టెంట్ కలెక్టర్ → కలెక్టర్ → డిప్యూటీ కమిషనర్ → డిప్యూటీ సెక్రటరీ → డిప్యూటీ డెరైక్టర్
- అసిస్టెంట్ కలెక్టర్ → కలెక్టర్ → డిప్యూటీ కమిషనర్ → అడిషనల్ సెక్రటరీ → జాయింట్ సెక్రటరీ → డెరైక్టర్
- అసిస్టెంట్ కలెక్టర్ → సెక్రటరీ → కమిషనర్ అండ్ సెక్రటరీ → ప్రిన్సిపల్ సెక్రటరీ → ఫైనాన్షియల్ కమిషనర్ → చీఫ్ సెక్రటరీ → చైర్మన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్
జిల్లా కలెక్టరు , జిల్లా మెజిస్ట్రేట్
[మార్చు]జిల్లా కలెక్టర్ సాధారణంగా కలెక్టర్ గానే సూచించబడతారు, ఇతను ఒక భారతీయ జిల్లా ముఖ్య పరిపాలకుడు, రెవెన్యూ అధికారి. కలెక్టర్ అలాగే జిల్లా మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్, కొన్ని జిల్లాల్లో డిప్యూటీ డెవలెప్మెంట్ కమిషనర్ గాను సూచింపబడతారు. జిల్లా కలెక్టర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యుడు, కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడతాడు.
సివిల్ సర్వీస్ పరీక్ష
[మార్చు]ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎంపికకు సివిల్ సర్వీస్ పరీక్ష వ్రాయాలి. ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు డిగ్రీ ప్రధాన అర్హత. వయస్సు 21-32 సంవత్సరాలలోపు ఉండాలి.
మూలాలు
[మార్చు]- ↑ https://web.archive.org/web/20170517051612/http://civillist.ias.nic.in/YrCurr/PDF/CadreStrength_01012017.pdf
- ↑ https://dopt.gov.in/sites/default/files/Revised_AIS_Rule_Vol_II_IAS_Rule_03.pdf
- ↑ Tummala, Krishna Kumar (1996). Public Administration in India. Mumbai: Allied Publishers. pp. 154–159. ISBN 978-8170235903. OCLC 313439426.
- ↑ Chesney, George Tomkyns (2016) [1870]. Indian Polity: A view of system of administration in India (classic reprint). London: Forgotten Books (published 8 December 2017). ISBN 978-1333187644. OCLC 982769345.
- ↑ "Civil Service". The British Library. 8 June 2011. Archived from the original on 25 September 2015. Retrieved 4 September 2017.
- ↑ Sabharwal, Meghna; Berman, Evan M., eds. (2013). Public Administration in South Asia: India, Bangladesh, and Pakistan (Public Administration and Public Policy) (1st ed.). Abingdon-on-Thames: Routledge. ISBN 978-1439869116. OCLC 1004349979.
- ↑ "Civil Service". The British Library. 8 June 2011. Archived from the original on 25 September 2015. Retrieved 4 September 2017.
- ↑ "Civil Service". The British Library. 8 June 2011. Archived from the original on 25 September 2015. Retrieved 4 September 2017.
- ↑ Sabharwal, Meghna; Berman, Evan M., eds. (2013). Public Administration in South Asia: India, Bangladesh, and Pakistan (Public Administration and Public Policy) (1st ed.). Abingdon-on-Thames: Routledge. ISBN 978-1439869116. OCLC 1004349979.