(Translated by https://www.hiragana.jp/)
క్రిస్మస్‌ చెట్టు కథ! | అవీ..ఇవీ...అన్నీ...
The Wayback Machine - https://web.archive.org/web/20140401091531/http://aviiviannee.blogspot.in/2012/12/christmas.html

క్రిస్మస్‌ చెట్టు కథ!

'కిస్మ్రస్‌ చెట్టుగా పచ్చని 'కొనిఫెరన్‌'ను ఉపయోగించటం ఆనవాయితీగా వస్తోంది. 16వ శతాబ్ధంలో జర్మనీలోనూ, 15వ శతాబ్ధంలో లివోనియా (ప్రస్తుతం ఈస్తోనియా, లాత్వియా)లో మొదట క్రిస్మస్‌ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలైందంటారు.
క్రిస్మస్‌ రోజుల్లో ఈ చెట్టుని ఇంటికి తెచ్చి కొవ్వొత్తులు లేదా విద్యుద్దీపాలతో, రకరకాల వస్తువులతో అందంగా అలంకరిస్తారు. క్రిస్మస్‌ చెట్టు పైభాగంలో నక్షత్రా (స్టార్‌) న్ని ఏర్పాటు చేస్తారు.
చారిత్రకంగా క్రిస్మస్‌ చెట్టుని పరిశీలిస్తే ఈ సంప్రదాయం 1781లో బెన్షివిక్‌ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించిందంటారు. 'జనరల్‌ ఫెడరిక్‌ అడాల్ఫ్‌ రెడిజిల్‌' అనే సైనికాధికారి ఇచ్చిన క్రిస్మస్‌ విందులో అతిథులను అబ్బురపరచటం కోసం 'ఫర్‌' చెట్టుని కొవ్వొత్తులతో, పండ్లతో అలంకరించాడట! 19వ శతాబ్ద ప్రారంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత రష్యాలాంటి దేశాల్లోనూ సంపన్న కుటుంబాలవారు క్రిస్మస్‌ చెట్టుని ఉపయోగించటం మొదలుపెట్టారు. 1816లో 'నస్సావో-విల్‌బర్గ్‌' యువరాణి 'హెన్‌రేటా' క్రిస్మస్‌ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసింది. ఆతర్వాత కాలంలో ఈ సంప్రదాయం ఆస్ట్రియాకి విస్తరించింది. ఫ్రాన్స్‌ దేశంలోకి 1840లో డచ్‌ వారి ద్వారా ఈ చెట్టు వచ్చింది. బ్రిటన్‌ దేశంలోకి 19వ శతాబ్ద ప్రారంభంలో క్రిస్మస్‌ సంప్రదాయంలో భాగమైంది.
రాణి విక్టోరియా.. తనకు చిన్నప్పటి నుంచి ఈ చెట్టుతో అనుబంధం ఉన్నట్లు ఒక పత్రికలో పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కిస్మస్‌చెట్టు ప్రసిద్ధిచెందింది.
ఈ క్రిస్మస్‌ చెట్టు చరిత్ర ఇలా వుంటే మరో కథ ఒకటి చెప్తారు. ఆ కథేంటంటే..
''చాలా ఏళ్ళ క్రితం క్రీస్తు పుట్టినరోజున చర్చికి వెళ్లి, రకరకాల బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లవాడికి ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో పైసా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబో తన ఇంటిముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి, ఓ చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసికెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన వారంతా ప్లాబో చేతిలోని కుండీని చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యంగా.. ఆ చిన్న మొక్క అప్పటికప్పుడు పెద్ద మొక్కగా ఎదిగి, బంగారు వృక్షంగా మారిపోయిందట! ప్రేమతో ఆ పేద బాలుడు తెచ్చిన కానుకే విశిష్టమైనది అయ్యింది. అందరూ ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు సిగ్గుపడ్డారు. మంచి మనస్సుతో ఇవ్వడం ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతిఏటా అందరూ క్రిస్మస్‌ చెట్టుని అలకరించడం మొదలుపెట్టారంట!''
ఈ పోస్టు యొక్క వర్గీకరణలు : రాష్ట్రం, లైఫ్ , దేశం, వార్తలు, christmas / Special / XMAS dengan judul క్రిస్మస్‌ చెట్టు కథ!. Special Thanks to original Author/source. This blog URL: http://aviiviannee.blogspot.in/2012/12/christmas.html. కృతజ్ణతలు !
రచయిత : సాయి కుమార్ - Sunday, December 23, 2012

Comment on this post "క్రిస్మస్‌ చెట్టు కథ!"

Post a Comment