రుథీనియం ఒక రసాయన మూలకం. దీని రసాయన హ్రస్వనామం Ru. దీని అణు సంఖ్య 44; అనగా దీని అణు కేంద్రకంలో 44 ప్రోటానులు ఉంటాయి. ఇది ఆవర్తన పట్టికలోప్లేటినం ఉన్న నిలువు వరుస (గ్రూప్) లో కనిపిస్తుంది. కార్ల్ క్లౌస్ అనే జర్మనీ దేశపు శాస్త్రవేత్త ఇది మూలకమే అని 1844 లో నిర్ధారించి ఈ పేరు పెట్టేరు. లేటిన్ భాషలో రుథీనియం అంటే రష్యా అనే అర్థం ఉంది. ఈ మూలకం ప్లేటినం దొరికే ఖనిజపు రాళ్లల్లోనే స్వల్పమైన పాళ్లల్లో దొరుకుతుంది. సాలీనా దీని ఉత్పాదన 20 టన్నులకి మించదు [6].
రుథీనియం చూడడానికి వెండిలా ఉంటుంది. మెత్తగా గుండ చేస్తే నల్లగా ఉంటుంది. ప్లేటినం లాగే ఇది కూడా మిగిలిన మూలకాలతో రసాయన సంయోగం చెందడానికి ఇష్టపడదు. ఉదహరికామ్లం లోను, గంధకికామ్లం లోనూ, నత్రికామ్లం లోనూ వేసినా కరగదు. విద్యుత్ పరికరాల్లో ఒరపిడికి ఓర్చుకోగలిగే లోహపు సన్నికర్షాల (contacts) నిర్మాణంలో ఈ లోహాన్ని ఉపయోగిస్తారు. కొన్ని రకాల రసాయన సంయోగాలని త్వరితపరచడానికి దీనిని ఉత్ప్రేరకి catalystగా ఉపయోగిస్తారు. ఈ రకం ఉత్ప్రేరకాలతో ఒక కొత్త రకం రసాయన సంయోగాలకి అవకాశం కలిగింది కనుక రుథీనియం విలువ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. చిన్న ఉదాహరణగా - ఈ రకం సంయోగాల వల్ల రకరకాల సువాసలు వెదజల్లే పంచరంగుల కొవ్వొత్తులు తయారు చెయ్యడానికి వీలు పడింది. ఈ రకం సంయోగాలకి నాంది పలికినందుకుగాను రాబర్ట్ గ్రబ్స్ కి నోబెల్ బహుమానం వచ్చింది. డేటా ఉల్లంఘనలు ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటాయి.