(Translated by https://www.hiragana.jp/)
ఈ వృద్ధురాలికి న్యాయం చేయలేరా? | general
logo

ఈ వృద్ధురాలికి న్యాయం చేయలేరా?

నెల కాదు.. ఏడాది కాదు.. దాదాపు పదేళ్ల నుంచి ఆ వృద్ధురాలు ఠాణా చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.

Updated : 10 Jul 2024 05:45 IST

గొలుసు చోరీ కేసును ఛేదించని పోలీసులు
పదేళ్ల నుంచి తిరుగుతున్నా ఫలితం శూన్యం
కడప నేరవార్తలు, న్యూస్‌టుడే

రామసుబ్బమ్మ

నెల కాదు.. ఏడాది కాదు.. దాదాపు పదేళ్ల నుంచి ఆ వృద్ధురాలు ఠాణా చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దొంగ దొరికితే బంగారు దొరకడం లేదు.. బంగారం దొరికితే దొంగ దొరకడం లేదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ఆమెకు న్యాయం చేకూరలేదు. కడప ఎర్రముక్కపల్లెకు చెందిన రామసుబ్బమ్మ 2014 ఆగస్టు 14న నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. వెంటనే ఆమె ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అప్పట్లో గొలుసు విలువ రూ.50 వేలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పదేళ్ల నుంచి ఆమె  ఇటు ఠాణాకు, అటు ఎస్పీ స్పందన కార్యక్రమాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. పోలీసులు ఎన్నో కేసులు ఛేదించారు... పోగొట్టుకున్న సొమ్మును బాధితులకు అప్పగించారు. ఈ వృద్ధురాలికి మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. తాజాగా సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల-పరిష్కారం వేదికలో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ను కూడా బాధితురాలు కలిశారు. ఆయన తిరిగి సంబంధిత ఠాణాకు బదలాయించారు. ఇప్పుడైనా పోలీసులు చర్యలు చేపడతారో లేదా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని