ZIM vs IND: బ్యాటర్ల మధ్య తీవ్ర పోటీ.. టీమ్‌ఇండియాకు మంచిదే: ఆండీ ఫ్లవర్
అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఇద్దరు క్రికెటర్లలో ఎవరిని ఆడించాలనే సంకట స్థితి ఇప్పుడు టీమ్‌ఇండియాలో ఉంది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: కేవలం 47 బంతుల్లోనే సెంచరీ కొట్టి మిగతా బ్యాటర్లకు అభిషేక్ శర్మ (Abhishek Sharma) సవాల్ విసిరాడు. జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లో డకౌట్ అయి నిరాశ పరిచినా.. కీలకమైన రెండో టీ20లో మాత్రం శతకంతో చెలరేగిపోయాడు. అయితే, ఇప్పుడు మూడో టీ20లో భారత మేనేజ్‌మెంట్‌కు ఓ సమస్య ఎదురైంది. తొలి రెండు మ్యాచులకు అందుబాటులో లేని యశస్వి జైస్వాల్ జింబాబ్వేలో (ZIM vs IND) అడుగుపెట్టాడు. మూడో టీ20లో అతడు ఆడటం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో సెంచరీ హీరో అభిషేక్‌ను ఎక్కడ ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వీరిద్దరూ ఎడమచేతివాటం బ్యాటర్లే కావడం గమనార్హం. మరోవైపు కెప్టెన్ గిల్ మాత్రం తానే ఓపెనర్‌గా ఉండాలని అనుకుంటున్నట్లు సిరీస్‌కు ముందే చెప్పాడు. దీంతో తుది జట్టు ఎలా ఉండనుందో అనే విషయంపై జింబాబ్వే మాజీ స్టార్ క్రికెటర్, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పందించాడు.
‘‘ఐదు టీ20ల సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు యశస్వి (Yashasvi Jaiswal) వచ్చేశాడు. ఓపెనింగ్ స్థానంపై తీవ్ర పోటీ ఉంది. భారత సెలక్టర్లకు ఇది కఠిన సవాలే. అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఇలా ఉండటం మాత్రం టీమ్ఇండియా క్రికెట్‌కు భారీ మేలు జరుగుతుంది. మరిన్ని ఆప్షన్లు ఉండటం వల్ల నాణ్యమైన క్రికెట్‌ను చూసే అవకాశం దక్కుతుంది. అభిషేక్ శర్మ ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉంది. ఐపీఎల్‌లో అతడి ఆటను చూశాం. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ బాదడం అద్భుతం. యువ క్రికెటర్‌కు ఇలాంటి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌పై నమ్మకం పెంచుతుంది. మున్ముందు మరిన్ని మంచి ఆటతీరును చూస్తామనడంలో సందేహం లేదు’’ అని ఆండీ ఫ్లవర్ తెలిపాడు.
నేనెప్పుడూ కోహ్లీతో పోల్చుకోను: రుతురాజ్
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) వన్‌డౌన్‌లో వస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఇదే స్థానంలో ఆడి ఇటీవలే పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ పాత్రను పోషించేందుకు రుతురాజ్ సిద్ధమవుతున్నాడని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇలాంటి వాటిపై దృష్టిపెట్టనని.. అసలు కోహ్లీతో పోల్చుకోవడం సరైంది కాదని రుతురాజ్ వ్యాఖ్యానించాడు. ‘‘ఇది చాలా పెద్ద విషయం. అసలు దానిగురించి ఆలోచించడమే సరైంది కాదు. కోహ్లీ పోలిక.. అతడి స్థానాన్ని పూరించడమంటేనే అత్యంత కఠినమైన సవాల్. ఐపీఎల్‌లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్లేస్‌ను.. ఇక్కడ విరాట్‌ను భర్తీ చేయడం చాలా కష్టం’’ అని రుతురాజ్ స్పష్టం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇద్దరూ.. ఇద్దరే
రోహిత్, కోహ్లి.. భారత క్రికెట్ జట్టు మూల స్తంభాలు. దశాబ్దానికి పైగా టీమ్‌ఇండియాకు కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టైటిల్‌తో ఈ ఇద్దరు పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేయడంతో ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ బాదుడును భర్తీ చేసే ఆటగాడు ఎవరు? మూడో స్థానంలో పరుగుల రారాజుగా ఎదిగేదెవరు? అనే ప్రశ్నలు వచ్చాయి. -
గిల్ వేలు విరిగింది
ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముంగిట టీమ్ఇండియాను గాయాల బాధ వెంటాడుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. -
సెమీఫైనల్లో భారత్
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన పోరులో 3-0తో ఒలింపిక్ రజత పతక విజేత చైనాకు షాకిచ్చింది. -
తలైవాస్ 4 ఓటముల తర్వాత
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తమిళ్ తలైవాస్ వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఓ విజయాన్ని అందుకుంది. శనివారం మ్యాచ్‌లో ఆ జట్టు 46-31 తేడాతో బెంగాల్ వారియర్స్‌పై పైచేయి సాధించి తిరిగి గెలుపు బాట పట్టింది. -
కుర్రాళ్లను చూసి గర్వపడుతున్నా
దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకున్న భారత కుర్రాళ్లను చూసి గర్వపడుతున్నానని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియా తాత్కాలిక కోచ్‌గా అతను వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
టైసన్ ఓటమి
దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రొఫెషనల్ బౌట్ బరిలో దిగ్గజం మైక్ టైసన్.. ఇప్పుడు అతని వయసేమో 58. ప్రత్యర్థి చూస్తే యూట్యూబర్ నుంచి బాక్సర్‌గా మారిన 27 ఏళ్ల జేక్ పాల్. -
పంత్ కోలుకోవడం ఓ అద్భుతం
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ కోలుకోవడం ఓ అద్భుతమని, అతడు మళ్లీ క్రికెట్ ఆడతాడని తాను అనుకోలేదని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. -
మెరిసిన షమి
టీమ్ఇండియా సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమి.. పునరాగమనంలో అదరగొట్టాడు. నిరుడు వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన అతను.. రంజీ ట్రోఫీలో బరిలోకి దిగి ఫామ్‌ను చాటుకున్నాడు. -
ఆసీస్‌దే టీ20 సిరీస్
పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. స్పెన్సర్ జాన్సన్ (5/26) విజృంభించడంతో శనివారం జరిగిన రెండో టీ20లో ఆసీస్ 13 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది.